newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

నాసిరకం ఉల్లి వంద పలుకుతుంటే ఉల్లిదోసెలు ఎలా చేస్తాం.. హోటళ్ల గగ్గోలు

07-12-201907-12-2019 15:06:17 IST
2019-12-07T09:36:17.173Z07-12-2019 2019-12-07T09:36:14.880Z - - 11-08-2020

నాసిరకం ఉల్లి వంద పలుకుతుంటే ఉల్లిదోసెలు ఎలా చేస్తాం.. హోటళ్ల గగ్గోలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వందకు అయిదు కిలోలు అంటూ బండ్లమీద వచ్చి మరీ ఉల్లిపాయలను అమ్మిన బంగారు రోజులకు కాలం చెల్లిపోయిందిప్పుడు.. నాసిరకం ఉల్లిపాయలు కిలోకు వంద రూపాయలు, నాణ్యమైన ఉల్లి కిలోకు 160 రూపాయలు పలుకుతున్న నేటి రోజుల్లో జనం అందరూ ఇష్టంగా తినే ఉల్లిదోశలు, ఉల్లి ఊతప్పాలను చేయడం మా వల్ల కాదు అంటూ హోటల్ వ్యాపారులు చేతులెత్తేశారు. ప్రత్యేకింది ఆనియన్ దోసెలకు, ఆనియన్ ఊతప్పాలకు మారుపేరుగా నిలిచిన కొన్ని హైదరాబాద్ హోటళ్లు అయితే ఉల్లి దోసెలు, ఊతప్పాలు లేవు అని బోర్డులు కూడా పెట్టేశాయి. 

ఉదాహరణకు హైదరాబాద్ నగరంలోని లక్ష్మీస్ టీఫిన్ సెంటర్ నాణ్యమైన, రుచికరమైన ఉల్లి దోసెలకు, ఉల్లి ఊతప్పాలకు మారుపేరుగా నిలిచింది. కానీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధరలు కిలోకు వంద నుంచి 160 వరకు పెరిగిపోవడంతో ఇక్కడే కాకుండా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల హోటళ్లు ఉల్లి దోసెలు, ఊతప్పాలను చేయడమే మానుకున్నాయి. టిఫిన్ సెంటర్లు, కూరగాయల విక్రేతలు, పంపిణీ దారులు ఇప్పుడు ఉల్లిపేరు ఎత్తితే ఠారుమంటున్నారు.

మార్కెట్ నుంచి ఉల్లిపాయలు కొనడం మానేశాం. వారం క్రితం వాళ్లు కిలో ఉల్లి వందరూపాయలకు అమ్మేవారు. ఇప్పుడు 130 నుంచి 150 రూపాయలకు ధరపెరింది. ప్రతి రోజూ ఉల్లి రేట్లు పెరుగుతున్నాయి. ఈ దశలో ఒకోరోజు క్వింటాల్ ఉల్లిపాయలు కొని నిల్వ చేసే స్తోమత మాకు లేదు అని లక్ష్మీస్ టిఫిన్ సెంటర్ యజమానురాలు లక్ష్మి చెప్పారు. కష్టపడి వందరూపాయలకు ఒకచోట ఉల్లి కొన్నాను. కానీ అవి చాలా చిన్నవి. పైగా నాసిరకం. చిన్న ఉల్లిపాయలు దోసెలకు, ఊతప్పాలకు పనికిరావు కాబట్టే మా హోటల్‌లో ఉల్లి ఊతప్పలు, ఉల్లి దోసెలను చేయడం ఆపేశాం అని ఆమె చెప్పారు.

ఇక రిటైల్ స్టోర్ యజమానుల బాధ చెప్పనలవికాదు. హోల్ సేల్ విక్రేతలనుంచి ఉల్లి కొంటే సగం ఉల్లి పైగా కుళ్లిపోతోందని  వీరు గగ్గోలు పెడుతున్నారు. చెడిపోయిన వాటినుంచి మంచి ఉల్లిపాయలను వేరు చేసి చూస్తే సగంపైగా పుచ్చులు కనబడుతున్నాయని శ్రీరాములు అనే రిటైల్ స్టోర్ యజమాని చెప్పారు. ఇతను తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో ఉన్న షాపు ఓనర్. పుచ్చులతో వ్యాపారం చేయలేక నష్టానికి సిద్ధమై కూడా వాటిని పారేస్తున్నామని బాధపడ్డారాయన.

మూడునెలల క్రితం క్వింటాల్ ఉల్లిపాయలను వెయ్యిరూపాయల కంటే తక్కువ ధరకు హోల్ సేల్ మార్కెట్ల నుంచి కొన్న రిటైల్ వర్తకులు ట్రక్కులోడ్ ఉల్లిపాయలను 3 వేల నుంచి 10 వేల రూపాయల ధరతో కొని లాభసాటిగా వ్యాపారం చేసేవారు. ఇప్పుడు ఉల్లి ధరలు పది రెట్లకు పైగా పెరగడం. వాటిలోనూ పుచ్చులు ఎక్కువ కావడంతో ఉల్లి కొనడమే మానుకున్నట్లు మలక్ పేటకు చెందిన ఉల్లిపాయల సరఫరా సంస్థ విష్ణు ఆనియన్స్ నిర్వాహకులు చెబుతున్నారు. 

వర్షాకాలం కారణంగా కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలనుంచి వచ్చే ఉల్లి దిగుమతులు బాగా తగ్గిపోయాయని విష్ణు ఆనియన్స్ యజమాని విష్ణు రాజ్ కందా చెప్పారు. ఉల్లి సరఫరా చూస్తుంటే వచ్చే సంవత్సరం జనవరి వరకు దక్షిణాది రాష్ట్రాలు అత్యధిక ధరలతో ఉల్లి కొనక తప్పడం లేదనిపిస్తోందిని చెప్పారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle