newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

నారాయణ అధ్యాపకుల ఆమరణ నిరాహారదీక్ష

21-05-202021-05-2020 11:50:45 IST
Updated On 21-05-2020 12:09:07 ISTUpdated On 21-05-20202020-05-21T06:20:45.238Z21-05-2020 2020-05-21T06:18:19.302Z - 2020-05-21T06:39:07.119Z - 21-05-2020

నారాయణ అధ్యాపకుల ఆమరణ నిరాహారదీక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ లోని నారాయణ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. రామంతపూర్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్ లో పని చేస్తోన్న రవి కుమార్ అనే ఉపాధ్యాయుడి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు నారాయణ అధ్యాపకులు. లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెల జీతం సగమే ఇచ్చిన నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. ఆన్ లైన్ క్లాసులు చెప్పమని, ఫీజులు వసూలు చేయాలని, అడ్మిషన్లు చేయాలని, రెన్యువల్స్ చేయాలని ఆదేశించిన యాజమాన్యం జీతాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

తాము యాజమాన్యం చెప్పిన పని చేసామని, కానీ సగం జీతం మాత్రమే ఇస్తాం, ఉంటే ఉండండి లేదంటే సంస్థ నుండి వెళ్లిపోండన్న యాజమాన్యం దారుణంగా మాట్లాడుతోందని అధ్యాపకులు వాపోయారు. నారాయణ, శ్రీ చైతన్య సంస్థలలో జీతాలు లేక ఇబ్బంది పడుతున్న సిబ్బంది చివరకు నిరాహార దీక్ష బాటపట్టారు. పని చేసిన దానికి జీతం ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నారాయణ విద్యాసంస్థల సిబ్బంది.

లాక్ డౌన్ బూచి చూపెట్టి సిబ్బందిని వదిలించుకునేందుకు శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలు ప్రయత్నిస్తున్నాయని వారు వాపోయారు. తమ ఉద్యోగాలు పోయినా ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతామంటున్నారు ప్రయివేట్ టీచర్లు. ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు తెలంగాణ ప్రయివేట్ టీచర్స్ ఫోరం ప్రతినిధులు. లాక్ డౌన్ అమలులో వున్న విద్యార్దుల తల్లిదండ్రుల నుంచి మాత్రం ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేసిన యాజమాన్యం తమకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని వారు మండిపడ్డారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle