newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్...సొగసు చూడతరమా?

19-10-201919-10-2019 20:35:31 IST
2019-10-19T15:05:31.860Z19-10-2019 2019-10-19T15:05:18.573Z - - 15-11-2019

నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్...సొగసు చూడతరమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రైల్వే బోగీలు, రైళ్ళు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. కొన్ని రూట్లు ప్రైవేటీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తిరుపతి-లింగంపల్లి మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ కొత్త రూపు సంతరించుకుంది.

అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు..బయో టాయిలెట్.., ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ ఇంజన్‌..కుదుపులు ఉండకుండా ప్రమాదాలకు తావులేకుండా వీటిని రూపొందించారు. ఈ రైలు వేగం కూడా పెరిగింది. నిత్యం వేలాది మంది భక్తులను తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధికి చేరుస్తున్న రైలుని బాగా తీర్చిదిద్దారు. 

1991 జనవరి 7న సికింద్రాబాద్‌-తిరుపతి స్టేషన్ల నడుమ ప్రారంభమైన ఈ రైలు డిమాండ్‌కు అనుగుణంగా 2018 సెప్టెంబర్ 5న లింగంపల్లి వరకు పొడిగించారు.  ఈరైలుకి 23 హాల్ట్ లు ఉన్నాయి.

సాధారణ బోగీలతో నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ కు మెరుగైన భద్రత కల్పించేందుకు లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను సమకూర్చారు. వీటివల్ల ప్రయాణికులు ఎలాంటి కుదుపులు లేకుండా ఎంత దూరమైన ప్రయాణించేందుకు వీలవుతుంది. అలసట తక్కువగా వుంటుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. 

కోచ్‌లలో సౌకర్యవంతమైన సీటు, ప్రమాదవశాత్తు కాలుజారి పడకుండా ఉండేందుకు పీవీసీ ఫ్లోరింగ్‌ ఏర్పాటు చేశారు. బయో టాయిలెట్లు, ఏసీ బోగీల్లో లైట్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్కసారి ప్రయాణం చేస్తే ఆ అనుభూతి చాలాకాలం వరకూ వుంటుంది.

ప్రయాణ సమయంలో 20 నిమిషాలు ఆదా అవుతుంది. నారాయణాద్రి సూపర్‌ ఫాస్ట్‌ రైలుకు ఎలక్ట్రిక్‌ ఇంజిన్‌తోపాటు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేయడంతో శబ్ద కాలుష్యం, కర్బన్‌ ఉద్గారాల విడుదల తగ్గిపోయి రైల్వేకి ఇంధనం ఆదా అయి  రూ.6 కోట్లు మిగులుతాయి.

ఈ రైలు లింగంపల్లిలో బయల్దేరి సికింద్రాబాద్ గుంటూరు మీదుగా తిరుపతికి వెళుతుంది నారాయణాద్రి ఎక్స్ ప్రెస్. ఈ రైలునుంచి ప్రకృతి దృశ్యాల్ని పెద్ద గ్లాసు కిటికీల ద్వారా హాయిగా చూడవచ్చు. ఏసీ బోగీల్లో చదువుకోవడానికి లైట్లు, బయటి శబ్దాలు వినిపించకుండా ఏర్పాట్లు చేశారు. రైలు అంటే ఇలా కూడా ఉంటుందా అనే విధంగా అందంగా రూపొందించారు. ఈ రైలు బోగీలను చూస్తే.. సొగసు చూడతరమా అని అనకుండా ఉండలేరు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle