facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

నయీం మళ్ళీ పుట్టాడా...? గ్యాంగ్ అరెస్ట్

11-03-201911-03-2019 16:00:06 IST
Updated On 11-03-2019 21:45:55 ISTUpdated On 11-03-20192019-03-11T10:30:06.241Z11-03-2019 2019-03-11T10:04:32.461Z - 2019-03-11T16:15:55.049Z - 11-03-2019

నయీం మళ్ళీ పుట్టాడా...? గ్యాంగ్ అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ్యాంగ్ స్టార్ నయీం పేరు వింటే తెలుగు రాష్ట్రాలు వణికిపోతాయి. నయీం ఎన్ కౌంటర్లో చనిపోయినా.. నయీం అనుచరుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. నకిలీ డాక్యుమెంట్‌లు సృష్టించి బినామీల పేరుతో మారుస్తుండగా అదుపులోకి తీసుకున్నారు ఎస్వోటీ పోలీసులు. నయీం భార్య హసీనా బేగంతోపాటు పాశం శ్రీనివాస్,అబ్దుల్ ఫహేం, అబ్దుల్ నాజర్ మరియు తుమ్మ శ్రీనివాస్ అరెస్ట్ అయినవారిలో ఉన్నారు.
 
నిందితుల నుంచి రూ.88.37 లక్షలు, మూడు కార్లను స్వాధీనం చేసుకొన్నట్టు పోలీసులు తెలిపారు. భువనగిరి సమీపంలోని నయీంకు చెందిన భూమి తుమ్మ శ్రీనివాస్ పేరున రిజిస్ట్రేషన్ అయింది. ఈ భూమిని విక్రయించాలని ఈ ముఠా ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఈ భూమిని కొనుగోలు చేసేందుకు వెంకటేశ్వరరావు ముందుకు వచ్చాడు. రూ.89 లక్షలకు ఐదు ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 8వ తేదీన భువనగిరి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసినట్టు రాచకొండ సీపీ తెలిపారు.
 
ఈ కేసుకి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారుల ప్రమేయం ఉందని సమాచారం రావడంతో విచారణ జరుపుతున్నామన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. మరోవైపు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి, సీఐ వెంకన్నలను రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఒరిజినల్ పేపర్లు లేకుండా కేవలం జిరాక్స్ పేపర్లపై రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎవరు సహకరించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle