newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

దుర్గమ్మ సన్నిధి ఇక ప్లాస్టిక్ ఫ్రీ

09-12-201909-12-2019 15:46:56 IST
2019-12-09T10:16:56.647Z09-12-2019 2019-12-09T10:16:52.295Z - - 24-01-2020

దుర్గమ్మ సన్నిధి ఇక ప్లాస్టిక్ ఫ్రీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమ్మలగన్నయమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ.. చాల పెద్దమ్మ దుర్గమ్మ సన్నిధిలో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించామని, భవానీలెవరూ కొండపైకి ప్లాస్టిక్ కవర్లను తీసుకురావద్దని దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు సూచిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణ కార్యక్రమం ఏటా వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది అనేక సౌకర్యాలు కల్పించామని సురేష్ బాబు చెప్పారు.

ఈ నెల 18 నుంచి 22 వరకు భవానీల దీక్షా విరమణ జరగనుంది. దీక్షా విరమణ రోజుల్లో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఈవో తెలిపారు. అమ్మవారి దర్శనార్థం ఏడు లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేశామని, ఇది మరంత పెరిగినా వారికి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కలశ జ్యోతి మహోత్సవానికి జ్యోతుల ఊరేగింపునకు హాజరయ్యే భక్తులు ఘాట్‌ రోడ్డు మీదుగా కాకుండా కనకదుర్గా నగర్‌ మీదుగా రావాలన్నారు.

అమ్మవారి దర్శనార్థం వచ్చే భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లతో పాటు గిరి ప్రదక్షిణ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో భవానీల కోసం మూడు హోమగుండాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి ప్రసాదాలు కూడా చాలినన్నీ తయారుచేస్తున్నామని, భవానీలు ఆలయ సిబ్బందికి సహకరించాలన్నారు. భవానీలు ప్లాస్టిక్ కవర్లు తీసుకుని రావద్దని ఆలయ ఈవో కోరారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle