newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

దున్న‌పోతును బ‌లిచ్చి క్షుద్ర పూజ‌లు.. ఆరిపాటిలో క‌ల‌క‌లం..!

14-02-202014-02-2020 12:10:54 IST
2020-02-14T06:40:54.338Z14-02-2020 2020-02-14T06:40:50.954Z - - 14-08-2020

దున్న‌పోతును బ‌లిచ్చి క్షుద్ర పూజ‌లు.. ఆరిపాటిలో క‌ల‌క‌లం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొయ్య‌ల‌గూడెం మండ‌లం ఆరిపాటి దిబ్బ‌ల గ్రామంలో చేత‌బ‌డి క‌ల‌క‌లం రేగింది. దీంతో గ‌త‌ మూడు రోజులుగా గ్రామ‌స్తులు నిద్రహారాలు లేకుండా భ‌యం భ‌యంగా గ‌డుపుతున్నారు. గ్రామంలో కామాక్షి అనే మ‌హిళ చేత‌బ‌డి చేస్తుంద‌ని తెలిసి స్థానికులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. జామాయిల్ తోట‌లో ఒక బాలుడి బొమ్మ‌ను చిత్రీక‌రించి గొయ్యి తీసి నిమ్మ‌కాయ‌లు, కుంకుమ‌, ప‌సుపుతో క్షుద్ర పూజ‌లు చేసిన ఆన‌వాళ్లు క‌నిపించాయి. దీంతో క్షుద్ర‌పూజ‌లు చేసిన మహిళ‌ను గ్రామ‌స్తులు చిత‌క‌బాదారు. పూజా సామాగ్రిని త‌గ‌ల‌బెట్టారు.

కాగా, గ‌త వారం రోజులుగా గ్రామంలో చేత‌బడి జ‌రుగుతుంద‌ని స్థానికులంతా తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన ప‌రిస్థితి నెల‌కొంది. అయితే మూడు రోజుల క్రితం చేత‌బ‌డి చేస్తున్న‌టువంటి మ‌హిళ‌ను ప‌ట్టుకున్న గ్రామ‌స్తులు ఆమెను విచారించారు. చేత బ‌డి ఎక్క‌డెక్క‌డ చేసింది..? ఏమేమి పెట్టింది..? అన్న వివ‌రాల‌పై వారంతా ఎన్‌క్వైరీ చేశారు.

అయితే, గ్రామంలో ఉన్న‌టువంటి జామాయిలు తోట‌లో ఒక దున్న‌పోతును బ‌లిచ్చి, దాని త‌ల తీసి ఒక గోతిలో పాతిపెట్టింది. ఆ గొయ్యి ప‌క్క‌నే బాలుడు బొమ్మ‌ను చిత్రీక‌రించిన ప్ర‌దేశాన్ని గ్రామ‌స్తులు గుర్తించారు. పూజ‌లు చేసే నిమ్మ‌కాయ‌లు వాట‌న్నింటిని మ‌రో గోతిలో పాతిపెట్టింద‌ని తెలుసుకున్న గ్రామ‌స్తులు ఆమెను తీసుకెళ్లి ఎక్క‌డైతే పాతి పెట్టిందో అక్క‌డ మ‌ళ్లీ గోతిని త‌వ్వి వాట‌న్నింటిని బ‌య‌ట‌కు తీశారు.

చేత‌బ‌డి చేసిన మ‌హిళ‌ను గ్రామ‌స్తులంద‌రూ నిల‌దీసి చిత‌క‌బాదారు. ఏ బాలుడి మీద‌కు ఈ క్షుద్ర పూజ‌లను ప్ర‌యోగించింది.? లేదా  గ్రామంలో ఉన్న‌టువంటి ఎవ‌రి మీద ప్ర‌యోగించింది..? అన్న‌ది తెలియ‌క‌పోవ‌డం.. దీనికి తోడు దున్న‌పోతును బ‌లివ్వ‌డం.. బాలుడికి సంబంధించిన‌టువంటి ఏ ఇంటి పిల్ల‌ల మీద దీన్ని ప్ర‌యోగిస్తుంద‌న్న‌ది గ్రామ‌స్తుల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేశాయి.

అస‌లే చిన్న గ్రామం కావ‌డం, అక్క‌డే నివాసం ఉంటున్న వారిని ఈ ఘ‌ట‌న‌ భ‌య‌కంపితుల‌ను చేయ‌డంతో గ్రామం మొత్తం ఒక్క‌టైంది. వారం నుండి జ‌రుగుతున్నా గ‌త మూడు రోజుల క్రితం ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దున్న‌పోతు త‌ల న‌ర‌క‌డం, అలాగే గొయ్యి తీసి నిమ్మ‌కాయ‌లు, క్షుద్ర పూజ‌లు చేసిన‌టువంటి గోతిలో పాతిపెట్టిన విష‌య‌మైతే ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. కానీ, రాత్రి స‌మ‌యంలో దాదాపుగా 12 నుండి 2 గంట‌ల మ‌ధ్య‌లో ఈ విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులంద‌రు కూడా అక్క‌డ‌కు వెళ్లి క్షుద్ర పూజ‌ల సామాగ్రిని గోతుల నుండి బ‌య‌ట‌కు తీయించారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle