newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

దిశ ఘటనపై అసభ్యకర పోస్టులు.. ఒకరి అరెస్ట్

03-12-201903-12-2019 16:54:53 IST
2019-12-03T11:24:53.863Z03-12-2019 2019-12-03T11:24:44.504Z - - 06-12-2019

దిశ ఘటనపై అసభ్యకర పోస్టులు.. ఒకరి అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ షాద్ నగర దగ్గర వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, దారుణహత్య సంఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. అన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. దిశా ఘటనపై అసభ్యకర పోస్ట్‌లు కలకలం రేపాయి. దీనికి కారణమయిన యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీరామ్‌గా గుర్తించిన సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

శ్రీరాంపై కేసును నమోదు చేసి సుమోటోగా స్వీకరించారు. కాగా దిశాపై హత్యాచారం జరిగిన నేపథ్యంలో.. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఆక్రోశం పెల్లుబికింది. అయితే ఓ గ్యాంగ్ మాత్రం సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేసింది. ఈ కామెంట్లు కూడా బాగా శృతిమించాయి. దీనిపై నిరసన వ్యక్తం అయింది.

దిశాకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ఈ గ్యాంగ్.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది.  సోషల్ మీడియాలో కామెంట్లపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ చర్యలకు పాల్పడ్డ మిగిలిన వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

వరంగల్‌లో డాక్టర్ కామాంధుడు 

వరంగల్‌లో ఓ డాక్టర్ విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 14 గిరిజన బాలిక హన్మకొండలోని ఓ హాస్టల్‌లో చదువుకుంటోంది. చదువుకుంటుంటే కళ్లలో నీరు రావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లింది. డాక్టర్ కు చూపించుకోవాలని నిర్ణయించుకున్న ఆ బాలిక ఆర్ఎంపీని ఆశ్రయించింది. చికిత్స కోసం వెళ్లిన బాలికపై ఆర్ఎంపీ కన్నుపడింది. ట్రీట్‌మెంట్ చేస్తున్నానంటూ ఇంజెక్షన్ ఇచ్చాడు. అది మత్తు ఇంజెక్షన్ కావడంతో... బాలిక మత్తులోకి వెళ్లిపోవడంతో ఆమెపై అఘాయిత్యం చేశాడు. 

మత్తులోంచి బయటపడ్డ బాలిక అసలు విషయం తెలుసుకుని హాస్టల్ కి వెళ్లి తల్లికి ఫోన్ చేసింది. తల్లిదండ్రులు ఆర్ఎంపీపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన కామాంధుడైన డాక్టర్ కోసం వెతుకుతున్నారు. వరుస సంఘటనల పట్ల మహిళలు, విద్యార్ధినులు ఆందోళనకు గురవుతున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle