newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

తీవ్ర తుపానుగా మారుతున్న సైక్లోన్ బుల్ బుల్

07-11-201907-11-2019 15:18:43 IST
Updated On 07-11-2019 15:26:57 ISTUpdated On 07-11-20192019-11-07T09:48:43.199Z07-11-2019 2019-11-07T09:48:40.760Z - 2019-11-07T09:56:57.434Z - 07-11-2019

తీవ్ర తుపానుగా మారుతున్న సైక్లోన్ బుల్ బుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సైక్లోన్ మహా అరేబియా తీరంలో అలజడి కలిగిస్తుంటే.. తాజాగా బంగాళాఖాతంలో  ఏర్పడిన బుల్‌బుల్‌ తుపాన్‌ తీవ్ర రూపం దాలుస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు బంగాళాఖాతం దానికి అనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై తుపాన్‌ బుల్ బుల్  కేంద్రీకృతమైంది.

పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 750, సాగరదీవులకు 860 కి.మీల దూరంలో ఇది నెలకొని ఉంది. శుక్రవారం నాటికి మరింతగా బలపడి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.

అనంతరం 36 గంటల్లో పెను తుపాన్‌గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను ప్రభావం ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. ఈ తుపాను పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ వైపు తన దిశను మార్చుకోనుంది. తుపాన్‌ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని అధికారులు చెప్పారు.

తుపాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాలోని అన్ని ప్రధాన పోర్ట్‌లలో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ తుపాను కారణంగా ఒడిశాలోని 14 జిల్లాలను అప్రమత్తం చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. 

జూన్ నుంచి ఇప్పటివరకూ మొత్తం 5 తుపానులు ఏర్పడ్డాయి. అందులో 4 తుపానులు అరేబియా సముద్రంలో ఏర్పడితే, 1 మాత్రం బంగాళాఖాతంలో ఏర్పడింది. ప్రస్తుతం సైక్లోన్ మహా, సైక్లోన్ బుల్ బుల్ కొనసాగుతున్నాయి.  సైక్లోన్ మహా గురువారం ఉదయం గుజరాత్ లోని డియో దగ్గర కేంద్రకృతం అయి ఉంది. 

ఆ టైంలో బయటకు రావద్దు.. వస్తే ప్రమాదం

ఆ టైంలో బయటకు రావద్దు.. వస్తే ప్రమాదం

   12 hours ago


కరోనా వైరస్‌తో కుదేలయిన హోటల్ ఇండస్ట్రీ

కరోనా వైరస్‌తో కుదేలయిన హోటల్ ఇండస్ట్రీ

   19 hours ago


గుప్త నిధుల కోసం ఘోరం..  మూగమహిళను బలిచ్చేందుకు యత్నం

గుప్త నిధుల కోసం ఘోరం.. మూగమహిళను బలిచ్చేందుకు యత్నం

   25-05-2020


ఓ రైతు సెల్ఫీ వీడియో కలకలం.. అసలేం జరిగింది?

ఓ రైతు సెల్ఫీ వీడియో కలకలం.. అసలేం జరిగింది?

   25-05-2020


అక్కడ బుసలు కొట్టిన శేషనాగు.. ఇక్కడ సరెండర్

అక్కడ బుసలు కొట్టిన శేషనాగు.. ఇక్కడ సరెండర్

   25-05-2020


తొలిపేజీ మొత్తంగా కరోనా మృతుల పేర్లు.. పాత్రికేయ చరిత్రలో అరుదైన ఘట్టం

తొలిపేజీ మొత్తంగా కరోనా మృతుల పేర్లు.. పాత్రికేయ చరిత్రలో అరుదైన ఘట్టం

   25-05-2020


ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

   24-05-2020


మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

   24-05-2020


ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

   24-05-2020


వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

   24-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle