newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

తరచూ అంతరాయాలు.. ఈ మెట్రో రైలుకి ఏమైంది?

18-01-202018-01-2020 15:18:28 IST
Updated On 20-01-2020 16:48:58 ISTUpdated On 20-01-20202020-01-18T09:48:28.258Z18-01-2020 2020-01-18T09:48:25.894Z - 2020-01-20T11:18:58.018Z - 20-01-2020

తరచూ అంతరాయాలు.. ఈ మెట్రో రైలుకి ఏమైంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ మహానగరంలో ప్రయాణాన్ని సులభతరం చేసింది మెట్రో రైలు. అయితే తరచూ మెట్రో రైలు మొరాయిస్తోంది. గతంలో అమీర్ పేట, బేగంపేట ప్రాంతాల్లో మెట్రోరైలుకి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. తాజాగా మరోసారి అంతరాయంతో మెట్రోసేవలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్‌కు వెళ్తున్న మెట్రో ట్రైన్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో  పంజాగుట్ట వద్ద దాదాపు 27 నిమిషాల పాటు మెట్రోరైలు నిలిచిపోయింది.

రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు కొద్దిసేపు ఇబ్బందులకు గురయ్యారు. ఆగిపోయిన మెట్రోరైలును లూప్‌లైన్‌లో పెట్టిన సిబ్బంది... మిగిలిన రైళ్లకు లైన్ క్లియర్ చేయడంతో రైళ్ళ రాకపోకలకు అంతగా అంతరాయం కలగలేదు.

గతంలోనూ మెట్రో రైలు ఇదే రూటులో నిలిచిపోవ‌డంతో ప్ర‌యాణికులు ఇక్కట్లు పాలయ్యారు. ఈమధ్యకాలంలో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకూ తప్ప అన్ని రూట్లలో మెట్రో నడుస్తోంది. దీంతో నగరం ఈమూల నుంచి ఆ మూలకు ప్రయాణించడం మేడ్ ఈజీ అయింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle