newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

తదుపరి పేలుడు చెన్నైలోనేనా.. 2015 నుంచి 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ

08-08-202008-08-2020 08:46:15 IST
2020-08-08T03:16:15.837Z08-08-2020 2020-08-08T03:16:12.321Z - - 30-09-2020

తదుపరి పేలుడు చెన్నైలోనేనా.. 2015 నుంచి 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దాదాపు 2,750 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌ను సంవత్సరాలుగా నిల్వచేసిన లెబనాన్ రాజధాని బీరుట్‌ అణుబాంబుతో సమానమైన పేలుడు కారణంగా విధ్వంసం అయిన నేపథ్యంలో తదుపరి పేలుడుకు దక్షిణ భారతదేశం కేంద్రం కానుందా? అవునని చెప్పడానికి ఇప్పటికే తగిన సాక్ష్యాధారం కూడా లభించింది. చెన్నై హార్బర్‌ గిడ్డంగిలో అయిదేళ్లుగా 700 టన్నుల ప్రమాదకరమైన అమోనియం నైట్రేట్‌ నిల్వలు ఉన్నట్లు వెల్లడి కావడంతో చెన్నై వాసులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చే్స్తున్నారు. మహానగరం చెన్నై మరో బీరూట్ కానుందా అంటూ చెన్నై వాసులు భీతిల్లుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. 2015లో చెన్నైకి చెందిన ఓ సంస్థ రూ.1.80 కోట్ల విలువైన 700 టన్నుల అమోనియం నైట్రేట్‌ను దక్షిణ కొరియా నుంచి తెప్పించింది. అయితే, ఎరువుల తయారీ గ్రేడ్‌ రసాయనం పేరుతో పేలుడు పదార్థాలకు వాడే గ్రేడ్‌ అమోనియం నైట్రేట్‌ను ఆ సంస్థ దిగుమతి చేసుకుంది. దీంతో ప్రమాదకరమైన ఆ కెమికల్‌ను అధికారులు సీజ్‌ చేసి, 37 కంటైనర్లలో హార్బర్‌లోని గిడ్డంగిలో ఉంచారు. అయితే అయిదేళ్లయినా ఆ కంటైనర్లు అక్కడే ఉన్నాయి. 

బీరుట్‌ హార్బర్‌లో సంభవించిన పేలుడు.. అమ్మోనియం నైట్రేట్‌ను ఏళ్లపాటు ఒకే చోట ఉంచిన కారణంగానే సంభవించడం తెలిసిందే. చెన్నై హార్బర్‌లో సైతం 2015 నుంచి అమ్మోనియం నైట్రేట్‌ గిడ్డంగికే పరిమితం కావడం వల్ల అదే తీరులో పేలుళ్లకు దారితీస్తే చెన్నై నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

కాగా.. చెన్నైలో ఉన్న అమ్మోనియం నైట్రేట్‌ విషయంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపాదికన చర్యలు చేపట్టాలంటూ పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ డిమాండ్‌తో కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు కదిలింది. దేశవ్యాప్తంగా పేలుడు, ప్రమాదకరమైన పదార్థాలు నిల్వ ఉన్న అన్ని గోదాముల్లో తక్షణమే తనిఖీలు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ క్రమంలో కస్టమ్స్‌ అధికారులు గురువారం చెన్నై హార్బర్‌లో అమోనియం నైట్రేట్‌ నిల్వలు, భద్రతా చర్యలపై తనిఖీలు చేపట్టారు. ఇక్కడి నిల్వలతో ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. 2015లో చెన్నై వరదల సమయంలో సుమారు 7 టన్నుల అమోనియం నైట్రేట్‌ పాడైపోగా మిగతా 690 టన్నులను త్వరలోనే ఈ–వేలం ద్వారా విక్రయిస్తామని వెల్లడించారు.

అమ్మోనియం నైట్రేట్‌ను అటు ఎరువుల్లోనూ, ఇటు పేలుడు పదార్ధాల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యవసాయానికి, మైనింగ్, నిర్మాణ రంగంలో అత్యవసరమైన వస్తువుగా దశాబ్దాలుగా ఉనికిలో ఉంటుంది. 

తగిన జాగ్రత్తలు తీసుకోకుండా సంవత్సరాలుగా దీన్ని నిల్వ చేయడంతో అది రసాయనిక చర్యకు గురై బీరుట్ నగరాన్ని విధ్వంసం చేసింది. ఇప్పటికే 150 మంది ఈ పేలుడులో చనిపోగా, దాదాపు 5 వేలకుపైగా ప్రజలు గాయపడ్డారు.

 

బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

   20 hours ago


వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !

వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !

   21 hours ago


తెలంగాణలో వింత.. తెల్లదూడకు జన్మనిచ్చిన గేదె

తెలంగాణలో వింత.. తెల్లదూడకు జన్మనిచ్చిన గేదె

   29-09-2020


పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

   28-09-2020


కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

   28-09-2020


ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

   28-09-2020


గల్లీ క్రికెట్ ఆడుతున్న కుక్కలు

గల్లీ క్రికెట్ ఆడుతున్న కుక్కలు

   26-09-2020


నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

   26-09-2020


భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

   26-09-2020


లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

   25-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle