newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

తక్షణ స్పందన.. 100కి డయల్ చేసిన యువతి

09-12-201909-12-2019 12:25:57 IST
Updated On 09-12-2019 15:21:48 ISTUpdated On 09-12-20192019-12-09T06:55:57.563Z09-12-2019 2019-12-09T06:55:52.651Z - 2019-12-09T09:51:48.229Z - 09-12-2019

తక్షణ స్పందన.. 100కి డయల్ చేసిన యువతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ షాద్ నగర్ ఘటన తర్వాత పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు. దిశ ఘటన ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే నగరంలోని హయత్‌నగర్‌లో ఓ ఆకతాయికి సంకెళ్ళేశారు పోలీసులు. తాను ఆపదలో ఉన్నానని యువతి ఫోన్ చేయగానే హయత్‌నగర్ పోలీసులు ఆఘమేఘాల మీద అలర్ట్ అయ్యారు. స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ కాలనీలో ఓ గృహిణి పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించసాగాడు. యువతి ఓపికతో వేచి చూసింది. కానీ రాజేశ్‌ అనే యువకుడి వేధింపులు ఆగకపోవడం, అసభ్యంగా ప్రవర్తించడంతో బాధిత యువతి చురుగ్గా వ్యవహరించింది. 

వెంటనే తన మొబైల్ తో 100కు కాల్‌ చేసింది. పోలీసులు కూడా ఆమె కాల్‌కు వెంటనే స్పందించారు. ఆమె పల్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజేశ్‌ను అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. దీంతో బాధిత యువతి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ మహిళ లాగే ఎలాంటి ఇబ్బంది కలిగినా, రాత్రి సమయంలో ఇంటికి వెళ్ళడానికి వాహనాలు ఇబ్బంది కలిగించినా తమకు వెంటనే డయల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. కేవలం ఆరునిముషాలలో పోలీసులు స్పందించడం పట్ల ఉన్నతాధికారులు వారిని అభినందిస్తున్నారు. 

మహిళలపై నేరాలు జరగకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్న వేళ ఈ ఘటన పోలీసులకు నైతిక స్థయిర్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆపద సమయంలో డయల్‌ 100కు కానీ, 112కు కానీ కాల్‌ చేయాలని, ప్రతి ఒక్కరూ హాక్‌-ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle