newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

తండ్రి కాదు... మృగాడు... కూతురితో అసభ్య ప్రవర్తన

13-02-202013-02-2020 12:36:24 IST
Updated On 13-02-2020 12:37:23 ISTUpdated On 13-02-20202020-02-13T07:06:24.819Z13-02-2020 2020-02-13T07:06:20.453Z - 2020-02-13T07:07:23.541Z - 13-02-2020

తండ్రి కాదు... మృగాడు... కూతురితో అసభ్య ప్రవర్తన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేటి స‌మాజంలో వెలుగు చూస్తున్న కొన్ని కొన్ని ఘ‌ట‌న‌లు ఒళ్లు కంప‌ర‌మెత్తేలా ఉన్నాయి. వావి వ‌ర‌స‌లు మ‌రిచి ప‌శువుల‌క‌న్నా హీనంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. న్యాయ స్థానాలు కొత్త కొత్త చ‌ట్టాలు తెస్తున్నా విలువ‌లు దిగ‌జారిపోతుండ‌టం విచార‌క‌రం. చ‌ట్టాల‌లోని లొసుగుల‌తో క్రైమ్ రేట్‌ను పెంచే ప‌నిలో నేర‌స్థులు బిజీగా ఉంటే, వారినే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుని ముసుగు వేసుకున్న కామాంధులు ఒక్కొక్క‌రుగా వెలుగు చూస్తున్నారు.

తాజాగా, సాటి స‌మాజం త‌ల‌దించుకునేలా మ‌రొక ఘ‌ట‌న‌ వెలుగు చూసింది. వావి వ‌ర‌స‌లు మ‌రిచిన ఓ తండ్రి కూతురిపైనే క‌న్నేశాడు. ఇంట్లో ఒక్క‌టే ఉండ‌టాన్ని గ‌మ‌నించి వెనుక నుండి వెళ్లి న‌డుము గుల్లి, హ‌గ్ చేసుకున్నాడు. కుటుంబ పెద్ద‌గా ఉంటాడ‌ని భావించి రెండో పెళ్లి చేసుకున్నాన‌ని, అలా అని త‌న కుమార్తెపై ఇలా బ‌రి తెగిస్తాడ‌ని అనుకోలేదంటూ కూతురి త‌ల్లి వాపోయింది.

క‌న్న కూతురుపై తండ్రి అత్యాచార య‌త్నానికి పాల్ప‌డిన దారుణ ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా చింత‌గాని మండ‌లం పాతర్ల‌పాడు గ్రామంలో చోటు చేసుకుంది. చింత‌గానిలో నివాసం ఉంటున్న ఓ వ్య‌క్తికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. అయితే, భార్య‌  చ‌నిపోవ‌డంతో అత‌డు ఇద్ద‌రు ఆడ పిల్ల‌లు ఉన్న‌ వితంతువును పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇద్ద‌రు ఆడ పిల్ల‌ల్లో 13 ఏళ్ల చిన్న కుమార్తెపై క‌న్నేశాడు.

కొద్ది రోజులుగా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ వ‌చ్చిన అత‌ను రాత్రి వేళ కుమార్తె నిద్ర‌పోతుండ‌గా ఆమెపై అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డ్డాడు. దీంతో బాలిక ఒక్క‌సారిగా కేక‌లు వేయ‌డంతో కుటుంబ స‌భ్యులు ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసిన చింత‌గాని పోలీసులు మాన‌వ మృగంలా ప్ర‌వ‌ర్తించిన తండ్రిపై ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

సంఘ‌ట‌న‌కు సంబంధించి బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ ఇంట్లో ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో వెనుక నుండి వ‌చ్చి హ‌గ్ చేసుకుని న‌డుము గిల్లాడు. ఆ రోజు మ‌ధ్యాహ్న స‌మ‌యంలో అమ్మ‌మ్మ వాళ్ల‌కు ఫోన్ చేసి విష‌యం చెప్పా. చెప్పీ చెప్ప‌గానే అమ్మ‌మ్మ వాల్లు ఇంటికి వ‌చ్చారు. వారు వ‌చ్చేస‌రికి రాత్రి 3 గంట‌లైంది. అదే రోజు రాత్రి అమ్మ‌మ్మ వాళ్ల‌తో క‌లిసి ప‌డుకున్న న‌న్ను చేయి ప‌ట్టుకుని తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు. దాంతో అమ్మా అమ్మా అంటూ గ‌ట్టిగా అర‌వ‌డంతో అమ్మ‌మ్మ వాళ్లు నిద్ర‌లేచి అత‌న్ని పోలీసుల‌కు అప్ప‌గించారు.

Image result for father rape attempted in daughter khammam district


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle