newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

ఢిల్లీ స్కూళ్ళో విషాదం... తెగిపడ్డ ఊయల

19-10-201919-10-2019 10:32:17 IST
Updated On 19-10-2019 10:35:11 ISTUpdated On 19-10-20192019-10-19T05:02:17.269Z19-10-2019 2019-10-19T05:01:59.427Z - 2019-10-19T05:05:11.175Z - 19-10-2019

ఢిల్లీ స్కూళ్ళో విషాదం... తెగిపడ్డ ఊయల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో ఎవరికీ తెలీదు. ఊయల రూపంలో వచ్చిన ప్రమాదం విద్యార్ధులను గాయాల పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. దేశరాజధానిలోని ఆనంద్‌విహార్‌ ప్రాంతంలో ఒక స్కూల్‌లో ఊయల తెగిపడింది. ఈ ఘటనలో ఒక ఉపాధ్యాయుడితో సహా 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. అమర్‌జ్యోతి ఛారిటబుల్‌ ట్రస్టు నిర్వహిస్తున్న అమర్‌ జ్యోతి స్కూల్‌లో ఒక ఉత్సవం నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగానే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్‌ ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగిందని, బయటివారిని ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. 

బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదం 

దీపావళి సమీపిస్తుండడంతో బాణసంచా తయారీ ఊపందుకుంది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలు మామూలైపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాణసంచా తయారీ కేంద్రంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయని.. దాంతో అక్కడ నిల్వ చేసిన టపాసులు పేలింది. 

ఇరవై రోజులక్రితం తూర్పుగోదావరి జిల్లా మేడపాడులో పేలుడు ఘటన జరిగింది. తాళ్ళరేవు మండలం జి వేమవరం లో ఇలాంటి దుర్ఘటన జరిగింది.. ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. గాయపడిన వారిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదం సంగతి మరిచిపోకముందే మరో ప్రమాదం మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని గుణ పట్టణంలో ఒక ఇంట్లో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది.

Image result for fire accident in crackers shop

ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిని సమీర్‌ (18), రుక్సార్‌ (26)గా గుర్తించారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేస్తున్నారు. 

ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

ఖండాంతరాలకు వ్యాపించిన జ్యోతి సాహసం.. ఇవాంకా ప్రశంసలు

   12 hours ago


మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

మేఘాలలో తేలిపోయేలా... మేఘాలయా సీఎం సంగ్మా గిటార్ హాబీ

   15 hours ago


ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

ఈ దొంగ మామూలోడు కాదు.. ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్ళబోయాడు

   17 hours ago


వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

వెండి నాణేల తుపాన్ ... అదనుచూసి ఎత్తుకెళ్లారు

   19 hours ago


కన్నతండ్రికోసం 1200 కి.మీ. సైకిల్ ప్రయాణం.. శ్రవణ 'కుమారి'కి సోషల్ మీడియా జేజేలు

కన్నతండ్రికోసం 1200 కి.మీ. సైకిల్ ప్రయాణం.. శ్రవణ 'కుమారి'కి సోషల్ మీడియా జేజేలు

   23-05-2020


గాంధీ హాస్పిటల్ వైద్యుల ఘనత.. ప్లాస్మా థెరపీ సక్సెస్

గాంధీ హాస్పిటల్ వైద్యుల ఘనత.. ప్లాస్మా థెరపీ సక్సెస్

   22-05-2020


చుట్టుముట్టిన సింహాలు.. అంబులెన్స్‌లోనే ప్రసవం

చుట్టుముట్టిన సింహాలు.. అంబులెన్స్‌లోనే ప్రసవం

   22-05-2020


వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

   21-05-2020


నారాయణ అధ్యాపకుల ఆమరణ నిరాహారదీక్ష

నారాయణ అధ్యాపకుల ఆమరణ నిరాహారదీక్ష

   21-05-2020


వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి ప్రియురాలు ఆత్మహత్య

వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి ప్రియురాలు ఆత్మహత్య

   21-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle