newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం.. ఎఎస్ఐ సాహసం

08-12-201908-12-2019 14:37:19 IST
2019-12-08T09:07:19.575Z08-12-2019 2019-12-08T09:07:13.257Z - - 24-01-2020

డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం.. ఎఎస్ఐ సాహసం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కృష్ణాజిల్లాలో ఈమధ్య కాలంలో నదిలోకి కొట్టుకుని పోయే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను ఎంతో చాకచక్యంగా కాపాడారు ఎఎస్ఐ. పులిగడ్డ - పెనుముడి వారధి పైనుండి కృష్ణానదిలోకి దూకేసింది డిగ్రీ చదువుతున్న యువతి. ఆత్మహత్యకు కారణం ఏంటో తెలీదు కానీ ఆమె చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. అంతేకాకుండా ఘటనా స్థలానికి దగ్గరలోనే నో యాక్సిడెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అవనిగడ్డ పోలీసులు.

డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం విషయాన్ని వాహనదారులు పోలీసులకు తెలియచేశారు. ఈ  సమాచారంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లిన అవనిగడ్డ పోలీసులు ఆమెను రక్షించే ప్రయత్నాలు చేశారు. వెంటనే నదిలోకి దూకి యువతిని కాపాడారు అవనిగడ్డ ASI మాణిక్యాలరావు, కానిస్టేబుల్ గోపిరాజు. యువతిని అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు.

యువతిని రక్షించిన ASI మాణిక్యాలరావును, గోపిరాజును అభినందించారు పోలీస్ ఉన్నతాధికారులు. స్థానికులు.  ఇంకో సంగతేంటంటే... ASI మాణిక్యాలరావు రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నారు. డిగ్రీ విద్యార్ధిని ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందో తెలియాల్సి వుంది.

వారంక్రితమే కృష్ణానదిలో కొట్టుకుపోతున్న ఓ మహిళను రక్షించడానికి తన ప్రాణాలను సైతం ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. నదిలో దూకి మరీ ఆమెను కాపాడారు. ఒడ్డుకు తీసుకొచ్చిన తరువాత ఆమెను కాపాడారు. ఆమెకు కృత్రిమ శ్వాసను అందించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించి, ఆమె ప్రాణాలను నిలపడంలో తనవంతు కృషి చేశారు. సాహసం చూపించిన పోలీసును డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle