newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

టీ కప్పు కోసం అలక.... గుర్రమా మజాకా!

02-12-201902-12-2019 13:39:32 IST
2019-12-02T08:09:32.935Z02-12-2019 2019-12-02T08:09:29.998Z - - 07-12-2019

టీ కప్పు కోసం అలక.... గుర్రమా మజాకా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు.. అదే మనిషి కుక్కను కరిస్తే అది ఖచ్చితంగా వార్తే అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ పొద్దున్నే కప్పు టీ తాగకుంటే పని ప్రారంభించని గుర్రం గురించి తెలిస్తే.. అది బ్రహ్మాండమైన వార్త అవుతుంది మరి. గుర్రం పొద్దుటిపూట కప్పులో టీ తాగుతున్న దృశ్యాన్ని వీడియోగా మారిస్తే, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అంతకు మించిన వైరల్ న్యూస్ ఏముంటుంది? 

లండన్‌లో ఒక పోలీసు గుర్రం టీ తాగడం ఎంతగా అలవాటు చేసుకున్నదంటే నా మామూలు నాకు ఇస్తేనే లేచి పనిచేస్తా అంటున్న గమ్మత్తైన వార్త జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.. మనుషుల్లాగే లండన్‌లో ఒక గుర్రం కూడా పొద్దునే కప్పు టీ తాగకుండా ఏ పని ప్రారంభించదట. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు యూకే పోలీసులు. తాజాగా గుర్రం టీ తాగుతున్న వీడియోనూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. 

వివరాలకు వెళితే. జాక్‌ అనే గుర్రం లండన్‌లోని మెర్సీసైడ్ పోలీసుల వద్ద 15 ఏళ్లుగా ఉంటుంది. వారు చేసే ఆపరేషన్లలో ఇది చాలా చురుకుగా పాల్గొనేది. నమ్మకంగా పనిచేసే ఆ గుర్రాన్ని ఉదయం పూట నిద్రలేపడానికి మొదట్లో జాక్‌ ట్రైనర్‌ లిండ్సే గేవన్‌ టీ ఇచ్చేవాడు. జాక్‌ క్రమంగా దానికి అలవాటు పడిపోవడంతో టీ తాగందే ఏ పని ప్రారంభించకపోవడం చేసేది. దీంతో మెర్సీసైడ్ పోలీసులు దానికోసం ఒక పెద్ద మగ్‌ను తయారు చేసి ప్రతీరోజు ఉదయం రెండు షుగర్‌ క్రిస్టల్స్‌ బాల్స్‌ను వేసి టీని అందిస్తున్నారు. అంతేగాక రాత్రి పూట కూడా టీ కచ్చితంగా ఇవ్వాల్సిందేనని లేకపోతే అది నిద్రపోదని తెలిపారు.

తాజాగా జాక్‌ టీ తాగుతున్న వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతూనే కామెంట్లు పెడుతున్నారు. 'ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఈరోజు మా దినచర్యను ఈ వీడియోతో ప్రారంభించాం' అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం జాక్‌ తన దినచర్యను టీ తాగకుండా ప్రారంభించకపోవడం ఫన్నీగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

జాక్ కచ్చితంగా తనదైన వ్యక్తిత్వం కలిగివున్న గుర్రం అని చెప్పగలను అంటున్నాడు ట్రెయినర్ లిండ్సే గేవన్. గుర్రాన్ని కట్టి ఉంచిన చోట నిలబడి మీరు కప్పు టీని చేతిలో పట్టుకోవడం చూసిందంటే అది సకిలిస్తూ టీని చప్పరించడానికి ముందుకొస్తుందని గేవన్ చెబుతున్నారు. అయితే తనకు రుచికరమైన, తనకు ఇష్టమైన విధంగా టీ చేసి ఇష్టంగా తాగుతుందట. ఎలాంటి టీ తనకు ఇష్టమో అది ఆర్డర్ చేస్తే కచ్చితంగా దాన్నే సర్వ్ చేయాలట. దానికి భిన్నమైన రుచి కలిగిన టీ ఇస్తే చస్తే తాగదట. 

వెన్న తీసిన పాలు, రెండు టీ స్పూన్ల చక్కెర, కాస్త చల్లటి నీరు కలిపి ఇస్తే అది పరవశించిపోతూ తాగుతుందట. వేడిగా ఉండే టీని అసలు ముట్టదది. ఒక సుగర్ బిళ్ల కలిపితే తాగుతుంది కానీ రెండో బిళ్ల కలిపితే మహదానందంగా తాగుతుందట. 15 ఏళ్ల క్రితం పోలీసు శాఖలో చేరినప్పుడు దానికి టీ తాగడం అలవాటైంది. అప్పటినుంచి రోజూ ఉదయాన్నే టీ ఇవ్వందే అది పని మొదలెట్టదు. 

టీ పట్ల దానికి ఎంత ఇష్టమంటే పొద్దుటే టీ సర్వ్ చేయకపోతే తనను ఉంచిన గుర్రపు శాలలోంచి బయటకు రావడానికి కూడా అది ఇష్టపడదట. మనిషే కాదు.. గుర్రం కూడా స్ట్రైక్ చేస్తుందన్నమాట. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle