newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

టిఫిన్‌లో వెంట్రుక వస్తే గుండు కొట్టడమే కదా న్యాయం!

09-10-201909-10-2019 13:51:33 IST
2019-10-09T08:21:33.298Z09-10-2019 2019-10-09T08:21:28.859Z - - 19-02-2020

టిఫిన్‌లో వెంట్రుక వస్తే గుండు కొట్టడమే కదా న్యాయం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత ఉపఖండం స్త్రీలను శీలపరీక్షకు గురి చేయడంలో, మానసిక హింసలతో చంపడంలో చాలాకాలం నుంచి పెట్టింది పేరు అనేది అందరికీ తెలుసు. భార్యను ప్రతిక్షణం అనుమానిస్తూ బయటకు పోయినప్పుడల్లా ఇంటికి తాళం వేసుకుని, తిరిగి వచ్చేదాకా ఆమెకు నిర్బంధ జీవితాన్ని ప్రసాదించేవారు 21వ శతాబ్దంలో కూడా కోకొల్లలు. ఇక భార్య బ్యాంకు బేలన్సులను తన గుత్తహక్కుగా భావించే జీతం వచ్చిన వెంటనే లాక్కునేవారు, ఆమె వాట్సప్, ఈమెయిల్స్ వివరాలను కూడా తీసుకుని కనిపించని నిఘా పెట్టేవారు మన దేశంలో తక్కువేమీ లేరు. ఇంకాపోతే తాగడానికి డబ్బులు ఇవ్వలేదని, మటన్ అడిగితే చేసిపెట్టలేదని ఆగ్రహించి తల్లిని, భార్యను, చెల్లిని, పిల్లలను కూడా అడ్డంగా నిరికి చంపుతున్న ఘటనలు నిన్న మొన్న కూడా ఈ దేశంలో జరిగాయి. 

మన దేశం సంస్కృతిని  ఉపఖండం నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ కూడా ఘనంగా కొనసాగిస్తున్నట్లుంది. టిఫెన్‌లో వెంట్రుక వచ్చిందని పిచ్చికోపంతో కట్టుకున్న భార్యకు గుండుకొట్టించి మరీ చావబాదిన మగమహారాజు మన ఉపఖండ వారసుడేనని మళ్లీ చెప్పాలా ఏంటి? పరాయి పురుషుడి పంచన చేరిన భార్యను తిరిగి ఇంట్లో పెట్టుకోవడానికి నేనేమన్నా అయోధ్య రాముడినా.. బారిక రాముడిని అని దారినపోయే దానయ్య చెబితే అంత పెద్ద సీతాదేవినే అడవులపాలు చేసిన ఘనమైన సంస్కృతి కదా మరి. టిఫన్‍‌లో వెంట్రుక కనిపిస్తే ఆ పాపం చేసిన ఆడదాన్ని ఊరికే వదులుతామా..

బంగ్లా దేశ్‌లో ఇదే జరిగింది. టిఫిన్‌లో వెంట్రుక వచ్చిందన్న కారణంతో ఓ వ్యక్తి భార్య(23)ను తీవ్రంగా అవమానించాడు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి.. బలవంతంగా గుండుకొట్టాడు. విచారకరమైన ఈ ఘటన బంగ్లాదేశ్‌ని జోయపుర్హట్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 

బాబుల్‌ మండల్‌ వ్యక్తి తన భార్యను టిఫిన్‌ పెట్టమని కోరాడు. దీంతో ఆమె అప్పుడే చేసిన అల్ఫహారాన్ని భర్తకి వడ్డించింది. అయితే వంట చేసే సమయంలో ప్రమాదవశాత్తు దానిలో వెంట్రుక పడింది. ఇది గమనించని భార్య.. అలాగే వడ్డించింది. వెంట్రుకను చూసిన బాబుల్‌ భార్యపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెపై దాడికి దిగాడు. అప్పటికీ కసి తీరకపోవడంతో.. బ్లేడ్‌ తీసుకుని బలవంతంగా ఆమెకు గుండు చేశాడు.

ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని అతన్ని అరెస్ట్‌ చేశారు. దీనిపై హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మహిళలకు కనీసం రక్షణ లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు. భార్యను ఇలా అవమానపరిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్‌ చట్టాల ప్రకారం అతనికి 14 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు అధికారి తెలిపారు.

పురాణాల్లో బారిక రాముడైనా... బంగ్లాదేశ్‌లో ఆధునిక రాముడైనా... స్త్రీల పట్ల పురుషన్యాయాన్ని అమలు చేయడంలో ఇన్నివేల సంవత్సరాల చరిత్రలో వీసమంత కూడా తగ్గకపోవడం పట్ల మగజాతి ఆణిముత్యాలు సంతోషంతో పరవశించాల్సిందే కదూ..

 

 

 

 

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle