newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

జీవితం అంటే ఉద్యోగం ఒకటే కాదన్న సాఫ్ట్‌వేర్ శారదకు నీరాజనం

28-07-202028-07-2020 06:08:05 IST
2020-07-28T00:38:05.786Z28-07-2020 2020-07-28T00:38:01.846Z - - 03-08-2020

జీవితం అంటే ఉద్యోగం ఒకటే కాదన్న సాఫ్ట్‌వేర్ శారదకు నీరాజనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జీవితం అంటే ఉద్యోగం ఒకటే కాదని ఆత్మహత్యలు పరిష్కారం కానేకాదని దేశం మొత్తానికి సందేశమిస్తూ కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్న హైదారాబాద్‌కు చెందిన యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శారదకు  దేశం యావత్తు సెల్యూటు చేస్తోంది. ఉపరాష్ట్రపతి కార్యాలయం మొదలుకుని ప్రభుత్వాధికారులు, మంత్రులు, సోనూసూద్ వంటి సినీనటులు సైతం చలించిపోతూ ఆమెకూ ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. 

పైగా లాక్ డౌన్ సమయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయిన శారదకు ఉద్యోగం ఇవ్వడానికి ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయిన యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్  శారద తల్లిదండ్రులకు సాయంగా కూరగాయల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యువ సాఫ్ట్‌వేర్‌ జీవిత గమనంపై మీడియాలో  ప్రచురించడంతో వైరల్‌ అయింది.

వివరాల్లోకి వెళితే,.దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లు సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన శారద ఇటీవల హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంచి ప్యాకేజీకి కొత్తగా జాబ్‌లో జాయిన్‌ అయ్యారు. మూడు నెలల పాటు ట్రైనింగ్‌ కూడా పూర్తి చేసుకున్నారు. అంతలోనే కరోనా వ్యాప్తి మొదలవడం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో సదరు కంపెనీ యాజమన్యం ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. అయినప్పటికీ ఎలాంటి కుంగుబాటుకు లోనవకుండా ఆమె తల్లిదండ్రులకు తోడుగా కూరగాయల వ్యాపారం ప్రారంభించారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముతున్న యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శారద స్ఫూర్తిదాయకమైన కథనంపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఆమెపై వచ్చిన  కథనం తనను ఎంతగానో కదిలించిందని కష్టపడి పనిచేయాలన్నది శారద ఆదర్శంగా తీసుకున్నారని వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. తద్వారా యువతకు ఆదర్శంగా నిలిచిచారని కొనియాడారు. శారద కష్టపడే తత్వం చూసి గర్వంగా ఫీలవుతున్నానని తెలిపారు. ప్రభుత్వం తరఫున శారద కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని  చెప్పారు. శారద కుంటుంబాన్ని కలుస్తానని ఎంపీ వెల్లడించారు. 

ఇక సాఫ్ట్‌వేర్‌ శారదపై సాక్షి కథనానికి ఉపరాష్ట్రపతి కార్యాలయం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్ మీడియా విభాగం, తెలంగాణ బీజేపీ నాయకులు, పలువురు ఎన్‌ఆర్‌ఐలు స్పందించారు. ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు పలు ఐటీ సంస్థలు ముందుకొచ్చాయి. 

జీవితం అంటే ఉద్యోగం ఒక్కటే కాదు.. కదిలించిన శారద సందేశం

ఉద్యోగం ఒక్కటే లైఫ్ కాదని యువ సాఫ్ట్‌వేర్‌ శారద అన్నారు. జీవితంలో ఆటుపోట్లు సహజమని, ఉద్యోగం కోల్పోయినంత మాత్రాన దిగులుపడొద్దని నెగటివ్‌గా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని ప్రముఖ తెలుగు టీవీ మీడియాతో మాట్లాడుతూ ఆమె యువతకు సందేశం ఇచ్చారు. ఓడిపోయినా ధైర్యంగా నిలబడి విజయం సాధించవచ్చని తెలిపారు. ఇదిలాఉండగా.. కుటుంబం కోసమే శారద కూరగాయలు అమ్ముతోందని ఆమె తల్లి తెలిపారు. శారదను చదివించేందుకు చాలా కష్టపడ్డానని చెప్పారు. చిన్నతనం నుంచి శారద బాగా కష్టపడేదని అన్నారు. వయసు పైబడిన తండ్రికి సాయం చేస్తోందని అన్నారు.

కాగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించి రియల్‌ హీరో అనిపించుకుంటున్న నటుడు సోనూసూద్‌ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ శారదకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రముఖ తెలుగు టీవీలో వచ్చిన  కథనానికి స్పందించిన సోనూసూద్ సాఫ్ట్‌వేర్ ఆమె ఫోన్ నంబర్ అడిగి తెలుసుకున్నారు. శారదకు వ్యక్తిగతంగా సాయం చేస్తానని హామీనిచ్చారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle