newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

చైనాలో ఘోర ప్రమాదం.. 21 మంది మృతి

09-07-202009-07-2020 09:54:13 IST
Updated On 09-07-2020 10:47:43 ISTUpdated On 09-07-20202020-07-09T04:24:13.972Z09-07-2020 2020-07-09T04:22:51.966Z - 2020-07-09T05:17:43.859Z - 09-07-2020

చైనాలో ఘోర ప్రమాదం.. 21 మంది మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మనుషుల ప్రాణాలు పోయే రోజులు ఇవి. అయితే ఇలాంటి సంఘటన ఒకటి చైనా దేశంలో జరిగింది. వేగంగా వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన చైనా దేశంలోని గూయిజ్‌హౌ ప్రావిన్సులో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న బస్సు చెరువు లోకి దూసుకెళ్లి పోయింది. అయితే ఆ సమయంలో ఆ చెరువులో నీరు అధికంగా ఉంది.

దీంతో బస్సులో ప్రయాణం చేస్తున్న 21 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు బస్సులో ప్రయాణిస్తున్న మరో 15 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. వారందరినీ దగ్గర్లోనే ఆస్పత్రులకు తరలించారు. వీరితో పాటు మరికొందరు ఆ చెరువులో గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే చెరువులో పడి పోయిన బస్సును తీయడానికి ప్రభుత్వ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

‘అనంత’లో ముగ్గురి దుర్మరణం 

https://www.photojoiner.net/image/IO5kPzcb

ఏపీలోని అనంతపురం రాప్తాడు మండలం గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌- బెంగళూర్‌ హైవేపై వేగంగా వస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle