newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

చుట్టుముట్టిన సింహాలు.. అంబులెన్స్‌లోనే ప్రసవం

22-05-202022-05-2020 09:09:42 IST
2020-05-22T03:39:42.985Z22-05-2020 2020-05-22T03:39:35.031Z - - 01-06-2020

చుట్టుముట్టిన సింహాలు.. అంబులెన్స్‌లోనే ప్రసవం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇదేదో సినిమా సీన్ కాదు... ఆ కుర్రాడేమీ సింహపుత్రుడు కాదు. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది. ఓ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతోంది. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ వచ్చింది. ఆమెను అందులో ఎక్కించుకుని ఆస్పత్రి వైపు దూసుకుపోతోంది. కానీ అకస్మాత్తుగా అంబులెన్స్ డ్రైవర్ వేగం తగ్గించి, బ్రేకులు వేయాల్సి వచ్చింది. నడిరోడ్డుమీద ఎదురుగా సింహాలు. ఇంకేంటి అందులో వున్నవారి ప్రాణాలు పైనే పోయాయి. కానీ ధైర్యం తెచ్చుకున్నారు. 

సింహాల గుంపు చుట్టుముట్టి అంబులెన్స్‌ను కదలకుండా చేయటంతో ఓ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించాల్సి వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.  ప్రసవ వేదనతో ఉన్న ఓ మహిళను ఆస్పత్రికి చేర్చేందుకు ఆమె ఇంటికి అంబులెన్స్‌ వచ్చింది. వారు మార్గమధ్యంలో ఉండగానే నాలుగు సింహాలు రోడ్డుపై కనిపించాయి.

చేసేదేంలేక అంబులెన్స్‌ను కాస్త దూరంలో ఆపేసారు. ఇంతలో నొప్పులు తీవ్రం కావటంతో అత్యవసర వైద్య సిబ్బంది సహకారంతో ఆ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించింది. అలాంటి పరిస్థితుల్లో మాకు వేరే దారిలేకపోయిందని, అంబులెన్స్ లోనే ప్రసవం చేయాల్సి వచ్చిందని మెడికల్ సిబ్బంది తెలిపారు. ఆ సింహాలు 20 నిముషాలకు పైగా అదే ప్రాంతంలో తచ్చాడాయి. చివరకు అవి అక్కడినుంచి వెళ్ళిపోయాక అంబులెన్స్‌ ఆస్పత్రికి చేరుకుంది. అంబులెన్స్ లోనే పుట్టిన ఆ పిల్లాడు మాత్రం ఇవేం తెలీక హాయిగా తల్లిఒడిలో నిద్రపోతున్నాడు. 

తల్లీ బిడ్డలకు అవసరమైన వైద్య సేవలు అందించామని... వారిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది చెప్పారు. గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ సింహాలకు ఆవాస కేంద్రం. ఈ పార్కులో తప్పించి వేరే ఎక్కడా కూడా ఆసియా సింహాల సంతానోత్పత్తి జరగటం లేదు. జునాగడ్ నవాబ్ కాలంలో ఇక్కడ సింహాల సంరక్షణ జరిగేది.  అప్పట్లో  13 సింహాలు ఉంటే వాటిని జునాగడ్ నవాబ్ పెంచి పోషించాడని నమ్ముతారు. అప్పటి నుంచి ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది.. ఇక్కడ ఉన్న చక్కటి వాతావరణం, వసతి, అటవీ పర్యావరణం సింహాలు ఇక్కడ సురక్షితంగా ఉండేందుకు అనుకూలంగా వున్నాయి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle