newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

చిన్న చిన్న తప్పులకే జైళ్లలో మగ్గుతున్నారు.. సాయం చేయాలంటూ..!

17-09-202017-09-2020 11:49:33 IST
2020-09-17T06:19:33.455Z17-09-2020 2020-09-17T04:19:41.254Z - - 01-10-2020

చిన్న చిన్న తప్పులకే జైళ్లలో మగ్గుతున్నారు.. సాయం చేయాలంటూ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సౌదీ అరేబియా లోని జెడ్డాలో 450 మంది భారతీయులు గత నాలుగు నెలలుగా జైలులో మగ్గుతూ ఉన్నారు. వీరిలో చాలా మంది తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరు చేసినవి చాలా చాలా చిన్న తప్పులు.. అయినా కూడా జైలులో మగ్గుతూ ఉన్నారు. తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతూ ఉన్నారు.. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తో మాట్లాడి తమను జైలు నుండి విడిపించాలని.. స్వస్థలాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని వారు కోరుతూ ఉన్నారు. తమ గోడును వెల్లడిస్తూ మీడియాకు వీడియో క్లిప్ ను పంపారు.

అక్కడ ఉన్న వాళ్లంతా వలస వెళ్లి పని చేసుకుంటూ ఉన్నవారు. చాలా చిన్న తప్పులు.. సిగ్నల్ ను దాటడం, కూరగాయలను, నీటిని అమ్ముతూ కనిపించడం, లాక్ డౌన్ నియమ నిబంధనలు తెలియకుండా ఉల్లంఘించిన కారణాల వలన వీరిని జైలులో పెట్టారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాలకు చెందిన వలస కార్మికుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని వారు వెల్లడించారు.

చేతుల్లో డబ్బులు లేక.. లాయర్ ను సంప్రదించలేక సౌదీ అరేబియా లోని జైళ్లలో మగ్గుతున్నారు చాలా మంది. ఆ తర్వాత పని ఇచ్చే వాళ్లు కూడా లేరని బాధపడుతూ ఉన్నారు. తమ ఇళ్లల్లో తామే కష్టపడే వాళ్ళమని ఇప్పుడు మాకు కూడా ఉపాధి లేదు.. ఇంట్లో వాళ్లకు డబ్బులు పంపలేకపోతున్నామని ఆవేదన వ్యకతం చేస్తున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు చెందిన కొందరు విడుదలయ్యారని.. కానీ భారత్ కు చెందిన మమ్మల్ని మాత్రం విడుదల చేయడం లేదని తెలిపారు వలస కూలీలు. వలస కూలీలలో చాలా మంది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ కు చెందిన వారే ఎక్కువ ఉన్నారని కూలీలు తెలిపారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ బాధను పట్టించుకోవాలని.. సౌదీ అరేబియాకు చెందిన అధికారులతో మాట్లాడాలని వారు కోరారు. తమను స్వస్థలాలకు తీసుకుని వచ్చే ఏర్పాట్లను చేయాలని కోరారు. 

 

అమెరికా ఎన్నికలలో కీలక ఘట్టం.. ముఖాముఖిలో ట్రంప్ - బైడెన్ విమర్శలు

అమెరికా ఎన్నికలలో కీలక ఘట్టం.. ముఖాముఖిలో ట్రంప్ - బైడెన్ విమర్శలు

   6 hours ago


బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

   29-09-2020


వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !

వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !

   29-09-2020


తెలంగాణలో వింత.. తెల్లదూడకు జన్మనిచ్చిన గేదె

తెలంగాణలో వింత.. తెల్లదూడకు జన్మనిచ్చిన గేదె

   29-09-2020


పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

   28-09-2020


కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

   28-09-2020


ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

   28-09-2020


గల్లీ క్రికెట్ ఆడుతున్న కుక్కలు

గల్లీ క్రికెట్ ఆడుతున్న కుక్కలు

   26-09-2020


నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

   26-09-2020


భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

   26-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle