newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు..ముగ్గురి దుర్మరణం

10-09-201910-09-2019 15:17:34 IST
2019-09-10T09:47:34.845Z10-09-2019 2019-09-10T09:47:33.094Z - - 15-09-2019

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు..ముగ్గురి దుర్మరణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. మితిమీరిన వేగం, పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాలకు కళ్ళెం పడడం లేదు. వాహనాల్లో ఇరుక్కుపోయి మరీ ప్రాణాలు వదులుతున్నారు. 

చిత్తూరు జిల్లా పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, హర్యానాకు చెందిన కంటైనర్ లారీ చంద్రగిరి మండలం తొండవాడ బైపాస్ వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

లారీ, బస్సు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం కారణంగా వాహనాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లును పోలీసులు జేసీబీ, క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డవారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. 

మరో సంఘటనలో నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు ప్రయాణిస్తోన్న ఓ ద్విచక్ర వాహనం బ్రిడ్జిని బలంగా ఢీ కొట్టడంతో అశోక్‌, అఫ్సర్‌, అబ్దుల్ అజీజ్‌ అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రాపూరు మండలం ఓబులాయపల్లిలో జరిగిన మొహర్రం వేడుకలు చూసి పెంచలకోనకి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle