facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

చిగురుపాటి జయరాం హత్యకేసు: ముగ్గురి అరెస్ట్

14-03-201914-03-2019 17:41:36 IST
Updated On 14-03-2019 18:22:04 ISTUpdated On 14-03-20192019-03-14T12:11:36.327Z14-03-2019 2019-03-14T12:10:24.818Z - 2019-03-14T12:52:04.440Z - 14-03-2019

చిగురుపాటి జయరాం హత్యకేసు: ముగ్గురి అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో డొంకంతా కదులుతోంది. పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నటుడు సూర్య, అసిస్టెంట్ డైరెక్టర్ కిశోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. జయరాం హత్య విషయం ముందే తెల్సినా అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, హత్యకు పరోక్షంగా సూర్య, కిషోర్‌ సహకరించడంపై విచారణ చేపట్టారు. అయితే ఈ హత్య కేసులో శిఖా చౌదరి పాత్రపై ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. 

భవిష్యత్తులో ఏమైనా ఆధారాలు లభిస్తే ఆమెపై యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. చిగురుపాటి జయరామ్ హత్యకు సంబంధించి ఆయన భార్మ పద్మశ్రీకి శిఖా చౌదరి మీద అనుమానం ఉందని పోలీసులు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆమె ప్రమేయం లేదని తెలిసిందన్నారు. కేసు 90 శాతం విచారణ పూర్తయిందని తెలిపిన పోలీసులు.. మరో 15 రోజుల్లో చార్జిషీట్ వేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు నిందితుడు రాకేష్ రెడ్డి ఏపీకి చెందిన మంత్రులకు ఫోన్ చేసినట్టు ఆధారాలు లేవన్నారు. 20 వేల గజాల భూమిని భూదేవి అనే పేరు మీద రాకేష్ రెడ్డి రిజిస్టర్ చేయించినట్టు తెలిపారు. ఈ భూమి బినామీ పేరుమీద రిజిస్టర్ అయిందనే అనుమానిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ అది బినామీ ప్రాపర్టీగా తేలితే, దాన్ని రద్దు చేయిస్తామంటున్నారు పోలీసులు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle