newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

చింతమనేని అరెస్ట్.. హైడ్రామా

11-09-201911-09-2019 15:43:55 IST
Updated On 11-09-2019 15:49:24 ISTUpdated On 11-09-20192019-09-11T10:13:55.420Z11-09-2019 2019-09-11T10:13:53.882Z - 2019-09-11T10:19:24.582Z - 11-09-2019

చింతమనేని అరెస్ట్.. హైడ్రామా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద నేత చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దళితులను దూషించి.. దౌర్జన్యం చేసినట్టు కేసులు ఎదుర్కొంటున్న చింతమనేని గత పన్నెండురోజులుగా పరారీలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య చింతమనేని బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు రెచ్చిపోయారు. చింతమనేని నివాసంలో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను అనుచరులు నిర్బంధించారు. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు చింతమనేని అరెస్టు చేశారు.

చింతమనేని ఎక్కడ? 12 టీంలతో గాలింపు

పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుతో పాటు పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. చింతమనేనిపై దాదాపు 50మంది కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

చింతమనేని కాపాడుతున్నారని ఆరోపణలున్న పోలీసు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. చింతమనేనిని ఆచూకీ కనుగొని, ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించారు. చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళుతున్న పోలీస్ వాహనాన్ని గోపన్నపాలెం వద్ద ఆయన అనుచరులు అడ్డగించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle