facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
*పుల్వామా అమర జవాన్లకు చంద్రబాబు సాయం... ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా * పుల్వామా ఘటనపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం....తీవ్రవాదులపై చర్యలకు పూర్తి మద్దతు.. ఒక దేశం ఒకటే మాట * కోమటిరెడ్డి, సంపత్ కేసు.... న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులకు జ్యుడీషి‌యల్‌ కస్టడీ.. 10వేల పూచీకత్తుపై విడుదల *పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్.. ఉగ్రవాద చర్యలు ఆపాలని, వారి ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరికలు* ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా *టీటీడీ బోర్డు సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు.. టీఆర్ఎస్‌లో చేరే అవకాశం * ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణలో 33 జిల్లాలు.. అందుబాటులోకి నారాయణపేట, ములుగు జిల్లాలు * భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’‌ సాంకేతిక అడ్డంకులు.. ప్రారంభించిన మరుసటి రోజే ఆగిపోయిన రైలు

గ్యాస్ బండ దందా

07-02-201907-02-2019 15:41:01 IST
2019-02-07T10:11:01.028Z07-02-2019 2019-02-07T10:10:58.080Z - - 17-02-2019

గ్యాస్ బండ దందా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్‌కి చెందిన సుబ్బారావు వారం క్రితం గ్యాస్ సిలిండర్ బుక్ చేశాడు. బుక్ అయినట్టు, సిలిండర్ రశీదు కూడా ఎస్ఎంఎస్ వచ్చింది. కానీ సిలిండర్ డెలివరీ కాలేదు..విషయం ఏంటని ఆరా తీస్తే డోర్ లాక్ ఉందని డీలర్ నుంచి సమాధానం వచ్చింది. డీలర్‌కు ఫిర్యాదు చేశాడో వినియోగదారుడు. రికార్డులు పరిశీలిస్తే మూడు రోజుల కిందటే డెలివరీ అయినట్లు నమోదై ఉంది. అసలు తమ ఇంటి డోర్ లాక్ లేదని వాదించినా.. ప్రయోజనం లేదని మళ్ళీ గ్యాస్ సిలిండర్ బుక్ చేశాడు. డోర్‌లాక్‌ అయితే డెలివరీ అయినట్టు ఎలా రికార్డ్‌ అయ్యిందన్నది డీలర్‌కు అర్ధం అయింది. మళ్లీ బుక్‌ చేయండి వెంటనే పంపిస్తాం అంటూ వినియోగదారుడిని పంపించి వేశారు.  వినియోగదారులకు అందించాల్సిన సిలెండర్లను...డెలివరీ బాయ్స్ మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్మేస్తున్నారు. వినియోగదారుని డోర్ లాక్ అయి ఉంటే ఆ సిలెండర్‌ను ఏజెన్సీకి అందచేయాలి. కాని డీలర్లు ఆ సిలిండర్లను రెట్టింపు ధరతో మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు. బుక్ చేసినా సిలిండర్ రాకపోవడంతో వినియోగదారులు లబదిబోమంటున్నారు. 

కొందరు గ్యాస్‌ డెలివరీ సిబ్బంది, కొందరు చిన్న చిన్న వ్యాపారులతో కలిసి నిర్వహిస్తున్న అక్రమ దందా ఇది. బుక్‌ చేసుకున్న వారి సిలిండర్‌ను చేరవేయకుండానే డోర్‌లాక్‌ అంటూ బ్లాక్‌ మార్కెట్‌‌కు తరలించడం మాములైపోయింది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలెండర్ దందాకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వం గ్యాస్‌ వినియోగదారుడికి ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ ధరలకే ఇస్తోంది. కొందరు డెలివరీ సిబ్బంది మాత్రం సబ్సిడీ సిలిండర్లను కమర్షియల్‌ వినియోగదారులకు రూ. 1,000 నుంచి రూ. 1,200 కు అమ్ముకుంటున్నారు. ప్రత్యేకించి టిఫిన్‌, స్నాక్స్‌ సెంటర్లు, మెస్‌లు, చిన్నచిన్న తినుబండారాలు అమ్మే వారితో కొందరు డెలివరీ సిబ్బంది కుమ్మక్కు అయ్యారు. సబ్సిడీ సిలిండర్లను వారికి అమ్ముతున్నారు.

ఒక డెలివరీ బాయ్‌ రోజుకు 50 నుంచి 60 సిలిండర్ల వరకూ సరఫరా చేస్తాడు. ఇందులో కనీసం 10 సిలిండర్లయినా బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నట్టు సమాచారం. ఈ దందాలో ఏడాదికి కొన్ని లక్షల రూపాయలు మేరకు చేతులు మారుతున్నాయి. దీంతో పాటు ఇంటికి సిలిండర్‌ తీసుకు వచ్చిన బాయ్స్‌కి బిల్లుతోపాటు అదనంగా రూ. 20 నుంచి రూ. 30 వరకు వసూలు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ వారు గ్యాస్ ఏజెన్సీల దందాపై ఓ కన్నేసి ఉంచాలని వినియోగదారులు కోరుతున్నారు. 

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle