newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

గూడూరు ఎమ్మార్వో పరార్.. ఏపీ బాధితుడూ సురేషే

08-11-201908-11-2019 12:58:56 IST
2019-11-08T07:28:56.619Z08-11-2019 2019-11-08T07:28:49.838Z - - 19-11-2019

 గూడూరు ఎమ్మార్వో పరార్.. ఏపీ బాధితుడూ సురేషే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో రెవిన్యూ అధికారులు హడలిపోతున్నారు. తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిని సజీవ దహనం చేసిన ఘటన సంచలనం కలిగించింది.

పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన తర్వాత ఏపీలోనూ రెవిన్యూ కార్యాలయాల ముందు ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. తమ పత్రాలన్నీ సక్రమంగానే ఉన్నా లంచం డిమాండ్ చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. 

ఏపీలోని కర్నూలు జిల్లా గూడూరు ఎమ్మార్వో హసీనా బీ వార్తల్లోకి ఎక్కారు. గూడూరులో ఎమ్మార్వో లంచావతారం వెలుగులోకి వచ్చింది. సురేష్ అనే వ్యక్తి తన భూమిని ఆన్ లైన్ చేయమని కోరగా ఎమ్మార్వో హసీనాబీ ఏకంగా 4 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. తనకు కాకుండా తన బినామీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మార్వో. 

దీనిపై ఏసీబీకి కంప్లైంట్ చేశాడు సురేష్. పాణ్యంలో ఆమె బినామీకి డబ్బులు అందచేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మార్వో హసీన బీ పారిపోయారు. ఆమె కోసం గాలిస్తున్నారు. ఏసీబీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అటు అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి బాధితుడు పేరు సురేష్.. ఏపీలోని ఎమ్మార్వో హసీనాబీ బాధితుడి పేరు కూడా సురేష్ కావడం గమనార్హం. తెలంగాణలో ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం అయిపోయిన సంగతి తెలిసిందే. ఆమెపై పెట్రోల్ పోసిన సురేష్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే.

తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా రెవిన్యూ అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కాళ్ళరిగేలా తిరిగినా తమ పని కావడం లేదని, అన్ని పత్రాలు ఉన్నా సతాయిస్తున్నారని బాధితులు మీడియా ముందు వాపోతున్నారు. ఒక రైతు కుటుంబం అయితే అబ్దుల్లాపూర్ మెట్ సీన్ రిపీటవుతుందని పోలీసుల ముందే హెచ్చరించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle