newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గులాబీ రేకులు కాదు.. అన్నం పొట్లాలు ముఖ్యం.. మండిపడ్డ ట్విట్టర్

06-05-202006-05-2020 06:39:45 IST
2020-05-06T01:09:45.029Z06-05-2020 2020-05-06T01:09:42.318Z - - 14-05-2021

గులాబీ రేకులు కాదు.. అన్నం పొట్లాలు ముఖ్యం.. మండిపడ్డ ట్విట్టర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితులకు చికిత్సలు అందిస్తోన్న ఆస్పత్రులపై ఆదివారం నాడు వైమానిక, నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు గులాబీ రెక్కలు చల్లడం, ఆస్పత్రుల్లో పని చేస్తోన్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేయడంలో భాగంగా వైమానిక దళానికి చెందిన విమానాలు విన్యాసాలు చేయడం పట్ల సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్‌’ తనదైన శైలిలో స్పందించింది. 

ఓ పక్క వైద్య సిబ్బంది గ్లౌజులు, మాస్క్‌లు, కవరాల్‌ సూట్ల లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో పేద ప్రజలు, వలస కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే ఈ గులాబీ పూల వర్షాలేమిటీ, ఈ విమానాల విన్యాసాలు ఏమిటని పలువురు విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఆ గులాబీ రెక్కలను వెదజల్లే బదులు ఆహార పొట్లాలను జార విడిచినా పేదలకు పూట గడిచేదికదా  అని మరికొందరు స్పందించారు.

విమాన విన్యాసాలకు డబ్బును వృధా చేసే బదులు వలస కార్మికులకు ఆదుకునేందుకు ఆ డబ్బును ఖర్చు పెట్టి ఉంటే బాగుండేదని మరి కొందరు స్పందించారు. పైగా లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రాణాలకు తెగించి అవిశ్రాంతంగా పనిచేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు ‘గులాబీ రేకులు’ చల్లడం ద్వారా అదనపు పని భారం మోపారంటూ కొందరు విమర్శించారు. 

Social Media Response On Flowers Shower On Hospitals - Sakshi

ఈ సందర్భంగా కార్టూనిస్టులు కూడా తమదైన శైలిలో స్పందించి వ్యంగ్య చిత్రాలను గీశారు. ప్రధాని మోదీ ప్రకటించిన జనతాకర్ప్యూ, తర్వాత లాక్ డౌన్, ఆ తర్వాత చప్పట్లు కొడుతూ వైద్య సిబ్బందికి అభినందనలు, ఆ తర్వాత దీపాల వెలుగులు వంటి రసవత్తర కార్యక్రమాలతో లాక్ డౌన్ షోను అలరించిన ప్రధాని నరేంద్రమోదీ తాజాగా హెలికాప్టర్ల లోంచి వైద్య సిబ్బందిపై, ఆసుపత్రులపై దేశవ్యాప్తంగా పూలు చల్లే కార్యక్రమం విషయమంలో మిశ్రమ స్పందనలు పొందడం గమనార్హం.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle