newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

గాంధీ హాస్పిటల్ వైద్యుల ఘనత.. ప్లాస్మా థెరపీ సక్సెస్

22-05-202022-05-2020 17:52:15 IST
Updated On 22-05-2020 18:12:11 ISTUpdated On 22-05-20202020-05-22T12:22:15.024Z22-05-2020 2020-05-22T12:22:06.411Z - 2020-05-22T12:42:11.032Z - 22-05-2020

గాంధీ హాస్పిటల్ వైద్యుల ఘనత.. ప్లాస్మా థెరపీ సక్సెస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ను తట్టుకోవడంలో తెలుగు రాష్ట్రాలు పకడ్బందీ చర్యలకు దిగాయి. నిత్యం కరోనా టెస్టులు చేస్తూ.. లాక్ డౌన్ నిబంధనలు అమలుచేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లివచ్చినవారు, బర్త్ డే పార్టీలు, ఇతర సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కరోనా బారిన పడుతున్నారు. ఈ వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బహుశా కరోనాకు వ్యాక్సిన్ హైదరాబాద్ లోనే తయారవుతుందేమోనని అంతా ఆశాభావంతో వున్నారు.

కరోనా రోగులకు చేపడుతున్న ప్లాస్మా థెరపీ ప్రక్రియలో హైదరాబాద్ కు చెందిన గాంధీ ఆస్పత్రి కొత్త చరిత్ర సృష్టించింది. కరోనా పాజిటివ్‌ రోగికి ప్లాస్మా థెరపీ చేసి విజయం సాధించారు గాంధీ వైద్యులు. హైదరాబాద్‌కు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి వారం క్రితం ప్లాస్మా థెరపీ చేయగా ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఈ ప్లాస్మాథెరపీ ద్వారా ఇప్పటి వరకు నలుగురి నుంచి ప్లాస్మా సేకరించారు. ఒక్కో దాత నుంచి 400 ఎంఎల్‌ ప్లాస్మాను సేకరించి గాంధీ ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో మైనస్‌ 80 డిగ్రీల సెల్సియ్‌స్ ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్‌లో భద్రపర్చారు. 

మొదటి రోగికి చికిత్స అందించిన రెండ్రోజులకు మరో రోగికి కూడా ప్లాస్మా థెరపీ ఇచ్చారు.ఇద్దరిలోనూ ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ప్లాస్మా థెరపీ చాలా రిస్కుతో కూడుకున్నదిగా చెబుతారు. అయితే గాంధీ వైద్యులు కరోనా వ్యాధి నుంచి కోలుకున్నవారి రక్తంలోంచి ప్లాస్మా సేకరించారు. రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటే కరోనా త్వరగా అటాక్ చేస్తుంది.

అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. కోవిడ్-19 బారి నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాను సేకరించి, అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు. గాంధీలో డాక్టర్లు ప్లాస్మా థెరపీ అనగానే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు చాలమంది వచ్చారు. అయితే ఎంపికచేసిన వారినుంచి ప్లాస్మా సేకరించి రోగులకు ఎక్కించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle