newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

ఖ‌ర్జూరంతో శ‌రీరంలో అద్భుత మార్పులు..!

09-08-201909-08-2019 13:45:05 IST
Updated On 09-08-2019 13:45:27 ISTUpdated On 09-08-20192019-08-09T08:15:05.401Z09-08-2019 2019-08-09T08:15:03.145Z - 2019-08-09T08:15:27.860Z - 09-08-2019

ఖ‌ర్జూరంతో శ‌రీరంలో అద్భుత మార్పులు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

శ‌రీరానికి త‌క్ష‌ణం శ‌క్తిని ఇచ్చే పండ్ల‌లో ఖ‌ర్జూరం ముందు వ‌రుస‌లో ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్ల‌ను  ఎక్కువ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల‌న అధిక మొతాదులో పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చ‌ని, అంతేకాక నాన‌బెట్టిన ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల‌న ఫైబ‌ర్ పుష్క‌లంగా ల‌భిస్తుంద‌ని వారు స్ప‌ష్టం చేస్తున్నారు. అలాగే ఈ ఖ‌ర్జూరాలు మ‌ల్టీ విట‌మిన్స్‌లా ప‌నిచేస్తాయి. వాటిలో ఉండే న్యూట్రీషియ‌న్స్ అందుకు స‌హాయ‌ప‌డ‌తాయి. ఖ‌ర్జూరాల్లో ఎక్కువ శాతం ఉన్న‌ ఐర‌న్  హెమోగ్లోబిన్‌ను పెంచి ఎర్ర‌ర‌క్త క‌ణాల పెరుగుద‌ల‌కు స‌హాయ‌ప‌డుతుంది.

అనినియా స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాల‌న్నా.. శ‌రీరానికి ఐర‌న్ అవ‌స‌రం ఎక్కువ ఉన్నా రోజుకు మూడు ఖ‌ర్జూరాలు తిన‌డం మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు. ఖ‌ర్జూరాలు క‌ళ్ల‌కు సంబంధించిన మాస్కుల‌ర్, రెటిన‌ల్స్‌ను మెరుగుప‌రుస్తుంది. ఖ‌ర్జూరాల‌లో కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది డ‌యేరియాను నివారించ‌డంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది.

అంతేకాక కొన్ని ఖ‌ర్జూరాల‌ను తీసుకుని గ్లాసు నీటిలో వేసి నాన‌బెట్టి.. నీటిని తాగ‌టం కార‌ణంగా పేగులు శుభ్ర‌మ‌వుతాయి. ఆ నీటిలో లాక్సేటిఫ్స్ అధికంగా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కాన్నీ నివారిస్తుంది. గ‌ర్భిణీలు ప్ర‌స‌వానికి ఒక నెల ముందు నుంచి ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల‌న ప్ర‌స‌వ స‌మ‌స్య‌లు, ర‌క్త‌స్రావం స‌మ‌స్య త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయి. 

ప‌ర‌గ‌డుపున ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల‌న బ్ల‌డ్ షుగ‌ర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు రోజుకు మూడు ఖ‌ర్జూరాలు తిన‌డం వ‌ల‌న మంచి ఫ‌లితం ల‌భిస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఖ‌ర్జూరాల‌లో పాస్ప‌ర‌స్ అధికంగా ఉండ‌టం కార‌ణంగా మెద‌డు నిత్యం చురుకుగా ఉంటుంద‌ని, ఎండు ఖ‌ర్జూరాల‌లో ఫ‌క్టోజ్‌, గ్లూకోజ్, సుక్రోజ్ అనే కంటెట్స్ ఉండ‌టం వ‌ల‌న ఖ‌ర్జూరాలు, పాలు కాంబినేష‌న్ తీసుకుంటే శ‌రీరానికి ఇన్‌స్టాంట్ ఎన‌ర్జీ అందుతుంది. ఇన్ని ఔష‌ధాలు ఉన్న ఖ‌ర్జూరాల‌ను రోజూ తీసుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle