newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

క్యాష్ డిపాజిట్లపై ఎస్‌బి‌ఐ షాకింగ్ నిర్ణయం

10-09-201910-09-2019 15:02:12 IST
2019-09-10T09:32:12.369Z10-09-2019 2019-09-10T09:32:09.635Z - - 15-09-2019

క్యాష్ డిపాజిట్లపై ఎస్‌బి‌ఐ షాకింగ్ నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మీరు ఎప్పుడు బడితే అప్పుడు బ్యాంక్ కి వెళ్ళి సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లు చేస్తున్నారా? అవసరం ఉన్నా లేకున్నా బ్యాంకుకి వెళ్ళే అలవాటుంటే మానుకోండి. మీరు పరిమితికి మించి డిపాజిట్లు చేస్తే బ్యాంకులు ట్యాక్స్ లు విధించనున్నాయి.

క్యాష్‌ డిపాజిట్లు, విత్‌డ్రాస్, ఏటీఎం సేవలు, చెక్‌ వినియోగంపై విధించే ఛార్జీల్లో ఎస్‌బీఐ మార్పులు చేసింది. వినియోగదారులు ఒక నెలలో మూడు సార్లు మాత్రమే ఉచితంగా తమ ఖాతాల్లో డబ్బును జమ చేసుకోవచ్చు. అంతకుమించి డిపాజిట్లు చేస్తే ఆయా క్యాష్ డిపాజిట్లకు ఛార్జీలను విధించనుంది బ్యాంకు. 

మూడు డిపాజిట్లు ఫ్రీ కాగా.. ఆ తర్వాత చేసే డిపాజిట్లకు ప్రతి లావాదేవీకి రూ.50 ఛార్జి చేస్తారు. మరోవైపు చెక్‌ బౌన్స్‌ అయితే రూ.150 ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ ఛార్జీలపై జీఎస్టీ అదనం, మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లో ఇకపై ఉచితంగా 10 లావాదేవీలను ఎస్‌బీఐకి చెందిన ఏటీఎంల్లో చేసుకునే అవకాశం ఉంది.

అలాగే ఇతర నగరాల్లో అయితే వాటి సంఖ్య 12గా నిర్ణయించింది.  ఎస్బీఐయేతర బ్యాంక్‌ ఏటీఎంల్లో నెలకు ఐదు లావాదేవీలను ఉచితంగా అందిస్తోంది ఎస్‌బీఐ. మరోవైపు సాలరీ అకౌంట్స్ ఉన్నవారికి ఏటీఎం సేవలను ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది.

వీటికి తోడు ఎన్ఇఎఫ్టీ, ఆర్టీజీఎస్ సేవలకు ఛార్జీలు అదనం. ఈ సవరించిన ఛార్జీలను అక్టోబరు 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు స్టేట్ బ్యాంక్ తెలిపింది. కాబట్టి, మీరు బ్యాంకుకి అస్తమాను వెళ్లే అలవాటుకి స్వస్తి పలకండి. పరిమితికి మించి మీరు 100 రూపాయలు డిపాజిట్ చేసినా అందులో సగం ట్యాక్స్ రూపంలో లాగేసుకుంటుంది. డబ్బులు ఊరికే రావు అనే మాటను గుర్తంచుకోండి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle