newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. తెలంగాణకు రానున్న రుతుపవనాలు

08-06-202008-06-2020 13:34:55 IST
Updated On 08-06-2020 14:57:19 ISTUpdated On 08-06-20202020-06-08T08:04:55.144Z08-06-2020 2020-06-08T08:04:51.741Z - 2020-06-08T09:27:19.689Z - 08-06-2020

కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. తెలంగాణకు రానున్న రుతుపవనాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మృగశిర కార్తె ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. బంగాళాఖాతం లో అల్పపీడనం ఏర్పడిన తరువాత కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరగనున్నాయి. 

రానున్న రెండ్రోజుల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 9, 10 తేదీల్లో విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజులుగా కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుని వచ్చిన రుతుపవనాలు రాయలసీమను పలకరించాయి. దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాలు, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అన్ని ప్రాంతాలు చల్లబడుతున్నాయి. 

ఆదివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. ఉండిలో 43.38, మక్కువలో 43.23, చీమకుర్తిలో 43.17 ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి రుతుపవనాలు  కోస్తాంధ్రను తాకుతున్నాయి. రాయలసీమలో మరింత ముందుకు ఇవి కదులుతాయని కూడా వాతావరణశాఖ ప్రకటించింది. కర్వార్, షిమోగ, తుముకూరు, చిత్తూరు, చెన్నైలలో రుతుపవనాలతో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.

మరో రెండుమూడు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నేటికల్లా అల్పపీడనం ఏర్పడవచ్చని మొదట అంచనా వేసినా ఇది ఒక రోజు ఆలస్యంగా రేపు సాయంత్రానికి ఏర్పడగలదని వాతావరణ శాఖ తెలిపింది.ఈ అల్పపీడనం ఏర్పడ్డాక వాయవ్యంగా కదులుతుంది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తా, దాన్ని ఆనుకున్న ఒడిసా, తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడతాయి. చెదురుమదురుగా అతి భారీ వర్షాలు కూడా పడతాయని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle