newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

కోవిడ్-19 వైద్య సహాయం ఎప్పుడు పొందాలి?

07-08-202007-08-2020 10:32:12 IST
2020-08-07T05:02:12.070Z07-08-2020 2020-08-07T05:01:43.951Z - - 30-09-2020

కోవిడ్-19 వైద్య సహాయం ఎప్పుడు పొందాలి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ చాపకింద నీరులా పెరుగుతోంది. కరోనాకు సంబంధించి అనేక కొత్త లక్షణాలు బయట పడుతున్నాయి. ఒక వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థపై ఆధారపడి వైరస్ ప్రభావాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం, వృద్దులు మరియు ఇదివరకే వేరే వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడవచ్చు.

వృద్ధాప్యం మరియు తక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్న వారు కోవిడ్-19 తో పోరాడడం చాలా కష్టంగా ఉంటుంది. గుండె జబ్బులు, మధుమేహం లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటారు మరియు ఈ వైరస్‌తో పోరాడలేరు. యువత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

1) దగ్గు, గొంతునొప్పి

2) పెదాలు/ముఖం నీలం రంగులోకి మారుట

3) విపరీతమైన జ్వరం

4) ఛాతిలో నొప్పి లేదా నొక్కినట్టు ఉండడం

5) శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు

6) రుచి, వాసన తెలుసుకునే సామర్థ్యం తగ్గడం  

ఈ లక్షణాలు గమనించినట్టయితే వెంటనే స్థానికంగా ఉండే వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు లేదా వైద్యులకు సమాచారం ఇవ్వాలి.  కోవిడ్-19 అనుమానితులు, బాధితులకు సేవలందించే ఆరోగ్య సిబ్బంది, వైద్యులు వారి దగ్గర ఉన్నప్పుడు మీ ముక్కు, నోరు, కళ్ళను తాకకుండా ఉండాలి.  కోవిడ్-19 అనుమానితులు, బాధితులకు సేవలు అందించడానికి వెళ్ళే ముందు మరియు అందించిన తర్వాత తప్పక చేతులను సబ్బు మరియు నీటితో కనీసం 40-60 సెకన్ల పాటు కడుక్కోవాలి. శానిటైజర్ ను అప్లైచేయాలి.

ఆహారం వండడానికి ముందు మరియు తరువాత, తినడానికి ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత, చేతులు మురికిగా అనిపించినపుడు సబ్బు మరియు నీటితో కనీసం 40-60 సెకన్లు కడుక్కోవాలి. ఆ తర్వాత చేతులు పైకెత్తి గాలికి ఆరబెట్టాలి. కోవిడ్-19 చికిత్స కోసం వచ్చే వారి శరీరం నుంచి వచ్చే చెమట, నోటి నుంచి వచ్చే ఉమ్మి, ముక్కు నుంచి కారే నీరు వీటన్నింటిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. వీటిలో కోవిడ్-19 వైరస్ ఉంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తాకవలసి వస్తే వెంటనే చేతులు సబ్బు మరియు నీటితో కనీసం 40-60 సెకన్లు కడుక్కోవలెను. కడుక్కొన్న తరువాత చేతులు పైకెత్తి గాలికి ఆరబెట్టండి.

కోవిడ్-19 బాధితుడు ఉన్న గదిలో ఏ వస్తువును ముట్టుకోకూడదు.పేషెంట్ వాడే వస్తువులయిన బెడ్ షీట్స్, టవల్స్, ప్లేట్, గిన్నెలు, గ్లాసులను గుర్తించి వాటిని ప్రత్యేకంగా ఉంచండి. వీటిని మిగిలిన సామాన్లు/వస్తువులతో కలపకండి. ఒకవేళ వాటిని ముట్టుకున్న వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ పేషెంట్ వాడిన వస్తువులు ఏవైనా తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే కనీసం 30 నిమిషాలు వేడి నీటిలో ఉంచి తిరిగి ఉపయోగించవచ్చు. పేషెంట్ కు ఆహారం మరియు ఇతర అవసరాలను వారు ఉంటున్న గదిలోనే అందించండి.

ఉపరితలాలను తాకవలసి వచ్చినపుడు లేదా శుభ్రపరిచినపుడు మరియు పేషెంట్ ఉపయోగించిన బట్టలు, దుప్పట్లు ఉతికినపుడు మూడుపొరల మాస్క్ (త్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్) తప్పనిసరిగా వాడాలి. కోవిడ్ రోగి వాడిన బాత్ రూం వాడాల్సి వస్తే శుభ్రం చేసి వాడాలి.  వైద్యులు ఇచ్చిన మందులు అన్నింటినీ సూచించిన సమయానికి రోగికి ఇచ్చి వేసుకునేటట్లు చూడండి.

కరోనా సోకిన పేషెంట్ ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ప్రతిరోజూ శరీర ఉష్ణోగ్రత తెలుసుకుంటూ ఉండాలి. పేషెంట్ లో వ్యాధి లక్షణాలయిన జ్వరము, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిలబడలేనంత బలహీనత, ఛాతిలో నొప్పి ఎక్కువయినట్టు అనిపిస్తే వెంటనే పైస్థాయిలో ఉన్న వైద్య సిబ్బంది, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి. 

 

బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

బూతులు తిట్టే చిలుకలను ఎప్పుడైనా చూశారా ?

   18 hours ago


వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !

వామ్మో ! రెండేళ్ల వయస్సులో అస్థిపంజరంతో స్నేహం !

   19 hours ago


తెలంగాణలో వింత.. తెల్లదూడకు జన్మనిచ్చిన గేదె

తెలంగాణలో వింత.. తెల్లదూడకు జన్మనిచ్చిన గేదె

   29-09-2020


పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

పదేళ్ల బాలుడి సహస విన్యాసం.. చేతివేళ్లపై నుండి యాభై కార్లు!

   28-09-2020


కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

కడుపు నిండా తినేసింది.. కదల లేక..!

   28-09-2020


ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

ఐటీ ఉద్యోగాలకు ‘టీసీఎస్’‌ పరీక్ష.. 40 వేల ఉద్యోగాలు

   28-09-2020


గల్లీ క్రికెట్ ఆడుతున్న కుక్కలు

గల్లీ క్రికెట్ ఆడుతున్న కుక్కలు

   26-09-2020


నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

నెగెటివ్‌ మార్కుల రద్దు.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 40% వస్తే పాస్‌

   26-09-2020


భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

భార్యపాదాలు భర్త తాకితేనే ఇప్పుడు వార్త.. బుల్లర్ చేసిన పని అదే మరి.

   26-09-2020


లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

లాక్ డౌన్ లో బాల్కనీలలో ఒకరినొకరు చూసుకున్నారు.. ఇప్పుడు ఎంగేజ్మెంట్

   25-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle