newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

కొబ్బరికాయ ఎలా కొట్టాలి?

11-03-201911-03-2019 12:45:51 IST
2019-03-11T07:15:51.989Z11-03-2019 2019-03-11T06:59:17.646Z - - 26-05-2019

కొబ్బరికాయ ఎలా కొట్టాలి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనం ఏ గుడికి వెళ్లినా తప్పకుండా దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. సాధారణంగా మనం తీసుకువెళ్ళిన కొబ్బరికాయను పూజారిచేత కొట్టిస్తాం. కానీ ఈ టెంకాయను మనమే కొట్టాలంటున్నారు పండితులు. కొబ్బరికాయను కొట్టడంవల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి కాయ పైన ఉండే పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే  కొబ్బరి కాయను దేవుడి ముందు కొడ్తామో మన అహంకారాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నామని అర్థం. లోపల ఉండే తెల్లని కొబ్బరిలా మన మనసును భగవంతుని ముందు పెట్టామని అర్థం చెబుతున్నారు.

నిర్మలమైన కొబ్బరి నీటిలా మనల్ని ఉంచుమని ఆ భగవంతున్ని ప్రార్థించాలి.  భగవంతుని సృష్టిలో  స్వచ్చమైన నీరున్న కాయ కొబ్బరికాయ మాత్రమే. అందుకే కొబ్బరికాయకు మన పూజలో ప్రత్యేక స్థానం ఉంటుంది. కొబ్బరికాయపై ఉండే మూడు కన్నులు.. త్రినేత్రుడికి ప్రతిరూపం అంటారు. మన శరీరానికి చర్మం ఎంత అవసరమో, కొబ్బరికాయకు పీచూ అంతే అవసరం. ఈ పీచును కొట్టే ముందు తీయకూడదు. కొట్టిన తరువాత తీయాలి. కొబ్బరికాయ మొదలులో ఉన్న మూడు కన్నుల దగ్గర చిప్ప కాస్త మెత్తగా ఉంటుంది. ముందే పీచుతీయడం వల్ల ఆ కన్నాల ద్వారా బాక్టీరియా కాయలోనికి త్వరగా ప్రవేశించి కాయ పాడయిపోయే అవకాశం ఉంది. కనుక ముందు పీచుతీయకూడదు. 

కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. అయితే కొబ్బరికాయను నీళ్ళతో కడిగి దేవుని ముందు కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు. రాయిపై కొబ్బరికాయను కొట్టేవారు ఆ రాయిని ఆగ్నేయ కోణంగా ఉండేటట్లు చూసుకోవాలంటున్నారు.  కొబ్బరికాయ సరిసమానంగా పగలడం మంచిదే. అయితే ఒకవేళ వంకరటింకరగా పగిలినప్పటికీ లేదా కుళ్లిపోయినట్లు కనిపించినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. 

అదేవిధంగా కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు కొబ్బరికాయను కొట్టి దానిని విడదీయకుండా చేతితో పట్టుకుని అభిషేకం చేయకూడదు. కాయను కొట్టి ఆ జలాన్ని ఓ పాత్రలోకి తీసుకుని, కాయను వేరుచేసి ఉంచి ఆ పాత్రలోని కొబ్బరినీటితో మాత్రమే అభిషేకం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు. ఒకవేళ కొబ్బరికాయ ఎలా పగిలినా ఫర్వాలేదు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle