newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

కుమ్మేసిన వర్షం..పిడుగు హెచ్చరికలతో హడల్

09-10-201909-10-2019 17:51:11 IST
2019-10-09T12:21:11.407Z09-10-2019 2019-10-09T12:21:07.597Z - - 19-02-2020

కుమ్మేసిన వర్షం..పిడుగు హెచ్చరికలతో హడల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ నగరంలో వర్షం ఎప్పుడు వస్తుందో అసలు తెలీడంలేదు. ఉదయం వాతావరణ శాఖ అలర్ట్ చేసినప్పుడు అధికారులు అందరికీ హెచ్చరికలు జారీచేస్తున్నారు. అదేదో పేరంటం పెట్టి పిలిచినట్టు వర్షం భోరున వచ్చి... కురిసి వెళ్లిపోతుంది.

ఆ తర్వాత అసలు కష్టాలు ప్రారంభం అవుతున్నాయి. బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్‌, జుబ్లీహిల్స్‌, పంజాగుట్టలో కుండపోతగా వర్షం కురిసింది. అమీర్‌పేట, ఖైరతాబాద్‌, ఎర్రమంజిల్‌లోనూ వర్షం కుమ్మేసింది. నగరంలో వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అంతా అలర్ట్ అయ్యారు.

వాతావరణ హెచ్చరికలను జీహెచ్ఎంసీ అధికారులు కూడా సీరియస్ గా తీసుకుంటున్నారు. మరోవైపు సాధ్యమైనంతమేర కార్యాలయాలు, ఇళ్లలోనే ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌ కుమార్ విజ్ఞప్తి చేశారు.

నగరంలో వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వర్షాల వల్ల ఏర్పడే ఇబ్బందులను వెంటనే తొలగించేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. వరద నీరు నిలిచిన చోట మ్యాన్‌హోల్స్ తెరిచిపెట్టే ప్రయత్నం చేయవద్దని లోకేశ్ కుమార్ సూచించారు.

జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇవ్వాలని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు.ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. వాతావరణంలో చల్లదనం ఎక్కువగా ఉండటం వల్ల... వచ్చే 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటు డెంగీ జ్వరాలతో జనం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో పిడుగుపాటు వల్ల ముగ్గురు చనిపోయారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle