newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

కాణిపాకం ఆలయ సమీపాన అగ్నిప్రమాదం

10-09-201910-09-2019 16:41:22 IST
2019-09-10T11:11:22.352Z10-09-2019 2019-09-10T11:11:20.906Z - - 15-09-2019

కాణిపాకం ఆలయ సమీపాన అగ్నిప్రమాదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిత్తూరు జిల్లాలోని తిరుమల తర్వాత మరో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో అగ్నిప్రమాదం జరిగింది. కాణిపాకంలోని వరదరాజ స్వామి ఆలయం సమీపంలో ప్రైవేటు లడ్డూ ప్రసాదాన్ని తయారుచేసే గోడౌన్ లో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది.

లడ్డూలు తయారు చేయడానికి వేడి చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.  ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల హోటళ్లల్లోని గ్యాస్ సిలిండర్లను పోలీసులు బయటకు తరలించారు. 

వినాయకచవితి సందర్భంగా కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు నుంచి కూడా  పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడంతో వారంతా ఆందోళనకు దిగారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన ఆలయానికి సమీపంలో బాలాజీ హోటల్ ఉంది.

అది మూడంతస్తుల భవనం. ఫస్ట్ ఫ్లోర్ లో హోటల్ ఉంది. పైన ఓ చిన్న ఇల్లు లాంటి ఉంది. ఇది హోటల్ కాకపోయినా అనధికారికంగా లడ్డూలు తయారుచేస్తున్నారు. వాటిని హోటల్ కి సరఫరా చేస్తారు. స్థానికంగా ఉండే ఆలయంలో అర్చకుడిగా పని చేసే వ్యక్తి లడ్డూలు తయారు చేసి వాటిని హోటల్ కి విక్రయిస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. 

లడ్డూలు చేసే క్రమంలో నూనె, నెయ్యి ఎగిసి మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే వున్న గ్యాస్ సిలిండర్ పేలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle