newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇలా చేయండి!

30-07-202030-07-2020 08:45:06 IST
Updated On 30-07-2020 10:16:36 ISTUpdated On 30-07-20202020-07-30T03:15:06.257Z30-07-2020 2020-07-30T03:14:43.536Z - 2020-07-30T04:46:36.194Z - 30-07-2020

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇలా చేయండి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరింది.16 లక్షలకు చేరువలో కేసులు రావడం మరింతగా ఆందోళనకు గురిచేస్తోంది. అయితే మరణాలు రేటు తగ్గడం, రికవరీ అయి ఇంటికి వెళ్లేవారి సంఖ్య పెరడడం ఊరట నిచ్చేదిగా వుంది. అయితే,  కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా మరియు మనకు మన ప్రియమైన వారికి  రాకుండా ఆపడం అంత కష్గం కాదు. కాకుంటే మనం అంతా ఆ ప్రయత్నం చేయాలి. 

* రోజు ఉదయాన్నే మీ ఇంటి డాబా మీద  లేదా  ఇంటి  బయట ఎండలో పావుగంటసేపు శ్వాస వ్యాయామాలు మరియు యోగా తప్పనిసరిగా  చేయండి.

* రోజుకు రెండుసార్లు పసుపు నీటితో ఆవిరిపట్టండి గోరువెచ్చని ఉప్పు  నీటితో గార్గ్లింగ్ చేయడం ఉత్తమం.

*  ఇంట్లో ప్రతి ఒక్కరూ గోరు వెచ్చని నీరు మాత్రమే తాగండి...అది ప్రతి అర గంటకు ఒకసారి కొద్ది కొద్దిగా చాలా సార్లు 5 లీటర్ల వరకు త్రాగండి...

* ఆయుర్వేదం లో సూచించిన విధంగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు, శొంఠి, పసుపు, లవంగాలు, మిరియాలు మొదలైనవి నీటిలో బాగా మరిగించి రెండు, మూడు పూటలా తాగాలి.

* రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో చిటికెడు పసుపును కలుపుకుని తాగండి. పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

* మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళే మనకు విలువైన ఆస్తి. వారికి  వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి  తేలికగా కోవిడ్ బాదిన పడే అవకాశాలు ఎక్కువ కనుక ఇంట్లో మరిన్నిజాగ్రత్తలు తప్పనిసరి చేయండి.

* శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి బలమైన ఆహారం అయిన కోడిగుడ్డు, పాలు, బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ ఎక్కువగా తినండి. మరియు రాగి జావా అంబలి చేసుకుని తాగితే మంచిది. 

* బి‌పి, షుగర్ వంటి అత్యవసరమైన మందులతో పాటు ఇంట్లో తప్పనిసరిగా 1. పారాసెటమాల్, 2.సిట్రేజిన్, 3.దగ్గు మాత్రలు,  4.మౌత్ వాష్ మరియు గార్గిల్  కోసం బీటాడిన్, 5.విటమిన్ సి మరియు డి 3, 6.బి కాంప్లెక్స్ జింకోవిట్ 7. ఆవిరి కోసం జండూ బామ్ మరియు పసుపు ఉంచుకోండి.

* ఆఫీసులు, ఉద్యోగ ప్రాంతం, రద్దీ ప్రాంతాల్లో నుండి ఇంటికి వస్తే తప్పనిసరిగా ఇంటి బయటే మీ మొబైల్, తాళాలు, పర్సులను శానిటైజ్ చేసుకోండి. అన్నీ శుభ్రం చేసి, బట్టలను బయటే విడచి డెట్టాల్ కలిపిన నీళ్ళలో ఉంచి వేడి నీళ్ల స్నానం చేసి మాత్రమే ఇంట్లోకి వెళ్లాలి.

* బయట నుండి ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువులను తప్పనిసరిగా శానిటైజరుతో శుభ్రం చేసుకోవాలి.

*  ఒకవేళ బయటికి వెళ్ళితే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, తరచుగా శానిటైజర్ ని చేతులకు రాసుకుని దగ్గర పెట్టుకోండి.

* బయటకు వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముక్కును, నోటిని, కళ్లను చేతులతో తాకడం చేయకూడదు. 

* ఆహారం వేడిగా ఉన్నపుడే తినాలి. ఎట్టి పరిస్థితుల్లో నిల్వ వున్న ఆహారాలను తీసుకోవద్దు. 

* రోగనిరోధక శక్తి ని పెంచే సి విటమిన్ ఎక్కువగా వుండే పండ్లు నిమ్మ, జామ, ఉసిరి తో పాటు ఆపిల్స్, బొప్పాయి, నారింజ మొదలైనవి తరచుగా తీసుకోవాలి.

* రోజు రాత్రి సమయం లో నీళ్లలో బిటడిన్ ద్రావణం కలిపి నోట్లో పోసుకుని గొంతులోకి వెళ్ళే లాగా పుక్కిలించి గార్గిల్ చేయాలి.

* ప్రతి రోజు కనీసం 6 -8 గంటలు నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకోండి. రాత్రిళ్ళు ఎక్కువ సేపు మెలకువగా ఉండకండి. 

* ఈ పరిస్థితుల్లో మద్యపానం జోలికి వెళ్ళక పోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే సిగరెట్ తాగడం, పాన్ గుట్కా లాంటి అలవాట్లు మానేయండి. 

* మీరు కోవిడ్ 19 వైరస్ బారిన పడ్డారని తెలుసుకోవడం చాలా తేలిక. మీకు గొంతు దురద, పొడి గొంతు, పొడి దగ్గు, అధిక ఉష్ణోగ్రత ఉంటే జాగ్రత్తగా వుండండి. శ్వాస ఆడకపోవడం, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఎక్కువైనా శ్వాసలో ఇబ్బందులు తలెత్తినా  తక్షణమే వైద్యుల సహాయం  తీసుకోవడం చేయాలి. కోవిడ్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle