newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

కరోనా వైరస్ కొత్త లక్షణాలు.. తస్మాత్ జాగ్రత్త!

29-06-202029-06-2020 13:32:25 IST
Updated On 29-06-2020 14:18:13 ISTUpdated On 29-06-20202020-06-29T08:02:25.820Z29-06-2020 2020-06-29T07:44:23.189Z - 2020-06-29T08:48:13.330Z - 29-06-2020

కరోనా వైరస్ కొత్త లక్షణాలు.. తస్మాత్ జాగ్రత్త!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచంలో ఇంచుమించు అన్నిదేశాలను ఇబ్బందిపెడుతున్న ఒకే ఒక సమస్య కరోనా వైరస్. కరోనా వైరస్ లో మరికొన్ని కొత్త లక్షణాలు బయటపడ్డాయి. కోటిమందికి పైగా కేసులు బారిన పడ్డారు. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  ఇదిలా ఉంటే కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని ఇదివరకు నిర్ధారించడం జరిగింది. కానీ ఇప్పుడు కరోనా లక్షణాల్లో మరికొన్ని వచ్చిచేరాయి.   

అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ కరోనా వైరస్‌ లక్షణాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని తెలిపింది. 

కొత్తగా కనుగొన్న వాటితో కలిపి మొత్తం 11 లక్షణాలను సీడీసీ తన అధికారిక జాబితాలో చేర్చింది. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా వీటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయి 

ఆలక్షణాలివే

* జ్వరం

* వణుకు 

* దగ్గు

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

* అలసట

* ఒళ్లు నొప్పులు

* తలనొప్పి

* రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం

* గొంతునొప్పి

* ముక్కు కారడం 

* వికారం లేదా వాంతులు

* డయేరియా

 వీరికి ఎలాంటి సమయంలో వైద్య సాయం కోరాలి? పైన కనబరిచిన లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. 

ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. అదే సమయంలో  శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉన్నపుడు, ఛాతిలో నిరంతరం నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తున్నపుడు, ఒంట్లో సత్తువ లేకపోవడం, పెదవులు లేదా ముఖం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలున్నపుడు వెంటనే స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బంది లేదా వైద్యులను సంప్రదించాలి. లేదా 104 నంబర్ కు కాల్ చేయాలి.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle