newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కరోనా వచ్చి ఐసోలేషన్లో వున్నవారేం చేయాలి?

02-08-202002-08-2020 09:27:48 IST
2020-08-02T03:57:48.215Z02-08-2020 2020-08-02T03:57:17.365Z - - 03-08-2020

కరోనా వచ్చి ఐసోలేషన్లో వున్నవారేం చేయాలి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ సోకి వైద్య ఆరోగ్య శాఖ సూచన మేరకు స్వీయ గృహనిర్బంధంలో ఉన్న వారు కొన్ని మందులు వాడాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్న పాజిటివ్‌ వ్యక్తులకు ప్రభుత్వం ఒక కిట్‌ పంపిణీ చేస్తుంది. ఎలాంటి వ్యాధి లక్షణాలు బయటికి కనిపించకపోయినప్పటికీ ఆరు రకాల మందుల తప్పక వాడాలని వైద్యులు సూచించారు. ప్రభుత్వం ఇచ్చే కిట్ లో విటమిన్‌-సీ 500 ఎంజీ మాత్రలు బలానికి ఉదయం 1, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి 10 రోజులు వాడాలి. 

కాల్షియం+డీ3 ట్యాబ్లెట్లు కూడా ఉదయం ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి. జింక్‌ సల్ఫేట్‌-20 ట్యాబ్లెట్లు కూడా ఉదయం 1, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి. బలానికి ఉపయోగించే ఎంవీటీ ట్యాబ్లెట్లు నిత్యం మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి. ఈ కిట్‌లో శానిటైజర్‌(180 ఎంఎల్‌) బాటిల్‌, 20  డిస్పోజబుల్‌ ఫేస్‌మాస్కులు ఉంటాయి. కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే ఎజిత్రోమైసిన్‌ 500 ఎంజీ మాత్రలు రాత్రికి భోజనం చేసిన తర్వాత ఒకటి చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి. 

జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నప్పుడు భోజనం చేసిన తర్వాత ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి పారసిటమాల్‌ 500 ఎంజీ వేసుకోవాలి. జలుబు ఉంటే రాత్రి భోజనం చేసిన తర్వాత సెట్రిజిన్‌ హెచ్‌సీఎల్‌ మాత్ర ఐదు రోజులు వేసుకోవాలి. గ్యాస్‌ట్రబుల్‌ ఉంటే పరగడుపున ప్యానట్రోజోల్‌ 40 ఎంజీ మాత్రలు 10 రోజులు వేసుకోవాలి. జలుబు, దగ్గుకు సీపీఎం సిరప్‌ ఇస్తున్నారు. దానిని రెండు మూతల మందు, రెండు మూతల నీళ్లు కలిపి రాత్రి భోజనం చేసిన తర్వాత సేవించాలి.

రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు రోజు వేలాదిగా నమోదవుతున్నాయి. అదే రీతిలో కోవిడ్ అనుమానితుల సంఖ్య కూడా భారీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ లక్షణాలున్న అనుమానితులు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏమైనా అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలుగానీ, తీవ్రమైన లేక కొత్త లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle