newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా భయం నుంచి బీమా రక్షణ

11-07-202011-07-2020 09:23:54 IST
2020-07-11T03:53:54.152Z11-07-2020 2020-07-11T03:51:46.309Z - - 08-08-2020

కరోనా భయం నుంచి  బీమా రక్షణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా దిగువ, మధ్యతరగతి జనం ఆర్థిక ప్రణాళికలు తలకిందులు అవుతున్నాయి. ఆస్పత్రులకు వెళితే లక్షలాది రూపాయలు బిల్లుల రూపంలో బాదేస్తున్నారు.  ఈ వైరస్‌ సంక్షోభ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ..బీమా సదుపాయం కల్పించే పాలసీలను అందుబాటులోకి తీసుకురావాలని  వివిధ సంస్థలను ఆదేశించింది.  దీంతో అనేక సంస్థలు కరోనా కవాచ్‌, కరోనా రక్షక్‌ పేరుతో పాలసీలు సిద్ధం చేశాయి. 

ఈ బీమా పాలసీలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆరోగ్య బీమా పాలసీలు సైతం కరోనాకు కవరేజ్‌ కల్పిస్తున్నాయి.18 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ వరకు వయసున్నవారు ఈ పాలసీలకు అర్హులు.

కాలపరిమితి తక్కువ: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ స్వల్పకాలం పాలసీలకు ఆమోద ముద్ర వేసింది. దీంతో మూడున్నర, ఆరున్నర, తొమ్మిదిన్నర నెలల కాలపరిమితితో కూడిన పాలసీలను ఎంచుకునే అవకాశం పాలసీదారులకు ఉంటుంది. 

ప్రీమియం తక్కువే:  ఈ రెండు పాలసీల ప్రీమియం దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలని బీమా సంస్థలను ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. పథకం, కాలపరిమితిని బట్టి ప్రీమియంను నిర్ణయించే అధికారం ఆయా సంస్థలకు అప్పగించింది. ప్రీమియం రూ.750 నుంచి 4,500 వరకు ఉంటుందని అంచనా.

కవచ్‌ పాలసీ: ఈ పాలసీ బీమా కవరేజ్‌ రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఇది ప్రస్తుత పరిస్థితులకు అనువైనదిగా చెప్పవచ్చు. 

రక్షక్‌ పాలసీ: ఈ పాలసీ కింద రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు బీమా కవరేజ్‌ లభిస్తున్నది. ఇది వ్యక్తిగత పాలసీ కావడం వల్ల ఒక్కరికే ప్రయోజనం అందుతుంది. మొత్తం ఫ్యామిలీ కవర్ చేసే పాలసీ అయితే ఉత్తమం. 

ఈ పాలసీల కాలపరిమితి ముగిస్తే వాటిని రెన్యువల్ చేసుకోవడం కుదరదు. ఈ పాలసీలు తీసుకునేందుకు పరీక్షలు అవసరం లేదు. పాలసీ తీసుకున్నా సరే 15 రోజుల తర్వాతే పాలసీ ప్రయోజనాలు పొందవచ్చు. హెచ్ డీ ఎఫ్ సీ ఎర్గో జనరల్ ఇన్స్యూరెన్స్, మాక్స్ బూపా, ఐసిఐసిఐ లాంబార్డ్ వంటగి 30 కంపెనీలు బీమా పాలసీలతో ముందుకు వచ్చాయి. కొన్ని నిబంధనలతో పాలసీ కవరేజ్ లభిస్తుంది. నేషనల్ ఇన్స్యూరెన్స్, స్టార్ హెల్త్ కవచ్, స్టార్ హెల్త్ రక్షక్, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ పాలసీలు కష్టకాలంలో బాసటగా నిలుస్తాయి. 

 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle