newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

కరోనా దెబ్బకు వందలోపు తగ్గిన చికెన్ ధరలు

12-02-202012-02-2020 16:21:12 IST
2020-02-12T10:51:12.278Z12-02-2020 2020-02-12T10:51:09.163Z - - 24-02-2020

కరోనా దెబ్బకు వందలోపు తగ్గిన చికెన్ ధరలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు వారాల క్రితం వరకు మార్కెట్లో కిలో 180 నుంచి 200 రూపాయల వరకు పలికిన కోడిమాంసం ధర కరోనా వైరస్ దెబ్బకు సగానికి సగం పడిపోయంది. పండుగల పూట కూడా మాంసాహారం మానని దేశప్రజలు కరోనా వైరస్ కలిగిస్తున్న భయాందోళనలకు జడిసి ప్రత్యేకించి కోడి మాంసాన్ని వద్దంటే వద్దంటున్నారు. ఫలితంగా మార్కెట్ ఢమాలుమంది. 

ఉదాహరణకు కర్నులు జిల్లాలోని కొడుమూరులో బుధవారం మాంసం మార్కెట్లలో కిలో చికెన్ పోటీపడటం కాదు తగ్గడంలో పోటీ పడి 80 రూపాయలకు పడిపోయింది. చికెన్ తీసుకోవాలంటే భయపడిపోతున్న నేపథ్యంలో కొడుమూరులో వ్యాపారాలు పోటీలు పడి మరీ చికెన్ ధరను సగానికి సగం పైగా తగ్గించి మరీ అమ్మారు. కొడుమూరు పట్టణంలో ఇటీవల రవికుమార్‌రెడ్డి అనే వ్యక్తి హోల్‌సేల్‌ చికెన్‌ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కిలో రూ.130 చొప్పున చికెన్‌ తీసుకుంటే ఆరు గుడ్లు ఉచితంగా ఇస్తానని ఆఫర్‌ ప్రకటించాడు. 

ఇప్పుడు ఆ ధరకు కూడా ఎవరూ చికెన్ కొనకపోవడంతో కిలో వంద రూపాయలనుంచి 80 రూపాయలకు తగ్గించి అమ్మడం ప్రారంబించారు. వంద రూపాయలకు కిలో చికెన్ బేరం దొరకడంతో వినియోగదారులు పోటీలు పడి మరీ ఎగబడ్డారు. కోడికూరా కావాలా.. రండి రండి బాబూ కిలో ఎనభై రూపాయలకే ఇత్తాం అంటూ వ్యాపారులు ఆహ్వానాలు పలుకుతుండటంతో ఇదే సందని భావించిన వినియోగదారులు రెండు, మూడు కేజీల వంతున పోటీ పడి మరీ పట్టుకుపోయారు. దీంతో ఒక్కరోజులోనే కొడుమూరు వంటి చిన్న పట్టణంలో ఒక్కో వ్యాపారి వద్ద  200 కిలోలకు పైగా కోడిమాంసం అమ్మడుపోయింది.

Image result for Chicken Prices Down in Kurnool

వ్యాపారులు ధర భారీగా తగ్గించడంతో మామూలుగా అరకిలో తీసుకునే వారు కిలో నుంచి రెండు కేజీల చికెన్‌ తీసుకెళ్లారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం బహిరంగ మార్కెట్లో స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.180, స్కిన్‌తో కలిపి రూ.150 ధర పలుకుతోంది.

కరోనా వైరస్ మనుషుల ప్రాణాలు అమాంతంగా తీసేయడమే కాకుండా కోడి మాసం ధరను కూడా భారీగా తీసేసింది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో సైతం కిలో చికెన్ వంద నుంచి 120 రూపాయల లోపు పడిపోవడం గమనార్హం. కొన్ని చోట్ల కోడి గుడ్లు కూడా సగం ధర పడిపోయి 30 రూపాయలకే డజన్ గుడ్లు అమ్ముతున్నట్లు తెలిస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle