newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా ఇంతకుముందు లేదా?

11-07-202011-07-2020 11:14:56 IST
Updated On 11-07-2020 20:12:23 ISTUpdated On 11-07-20202020-07-11T05:44:56.880Z11-07-2020 2020-07-11T05:44:54.106Z - 2020-07-11T14:42:23.725Z - 11-07-2020

కరోనా ఇంతకుముందు లేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా ని గుర్తించటం ఎలా

ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా, ఏ ఛానల్ చూసినా, ఏ పేపర్ తిరగేసినా చర్చించే అంశం కరోనా. ఇంతకుముందు ఏ వైరస్ భయపెట్టనంతగా ఇది ప్రపంచాన్ని భయపెడుతూ ఉంది. వైరస్ ఎక్కువగా జంతువులపై ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ, ఎయిడ్స్, ఎబోలా, సార్స్ వంటి కొన్ని వైరస్ లు మనుషులమీద కూడా ప్రభావాన్ని చూపి ఎంతోమందిని పొట్టనపెట్టుకున్నాయి.  

సహజంగా మనలో ఉండే రోగనిరోధక శక్తితో ఈ వైరస్ లను ఎదుర్కోవడం సులభమే. కానీ, కరోనా వంటివి అంతసులభంగా మన శరీరంనుంచి బయటకువెళ్ళవు. ఇమ్మ్యూనిటి పవర్ తగ్గితే మన ప్రాణాలను హరిస్తాయి. ఎక్కువగా జంతువులనుంచే ఇవి మనుషులకు సంక్రమిస్తాయి. ఎయిడ్స్, ఎబోలా వంటివాటికీ తప్ప పోలియో వంటివాటికి శాస్త్రజ్ఞులు వాక్సిన్లను కనిపెట్టగలిగారు. కరోనాకి కూడా తొందరలోనే వాక్సిన్ వస్తుందని అనుకుంటున్నాము.  

అసలు కరోనా చరిత్రని చూద్దాం : 

కరోనా 1960 ప్రాంతంలోనే ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. క్రౌన్ అంటే కిరీటం ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి కరోనా అని పేరుపెట్టారు.  1960 ప్రాంతంలో దీనిని జంతువులలో గుర్తించారు.  2003 లో ఈ వైరస్ కొత్త రూపాన్ని సంతరించుకుని మనుషులకు వ్యాపించింది.  అప్పుడు దాదాపుగా 774 మందిని మట్టుపెట్టింది.  "ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్" అని దానికి పేరుపెట్టారు. దీనినే సార్స్ అంటారు. దీనికి వాక్సిన్ ని కనిపెట్టి శాస్త్రజ్ఞులు త్వరగానే అంతం చేసారు.

2014 లో మిడిల్ ఈస్ట్ ని వణికించింది మరో వైరస్. మిడిల్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని దానికి పేరుపెట్టారు.  దానినే మార్స్ అంటారు. దీని బారినపడి దాదాపుగా 858 మంది ప్రాణాలువిడిచారు.  ఎంతో శ్రమించి శాస్త్రజ్ఞులు వాక్సిన్ ద్వారా దీన్నికూడా నిర్ములించగలిగారు.

ఇప్పుడు అదే వైరస్ రూపాంతరంచెంది కరోనాగా లక్షలమంది ప్రాణాలను హరిస్తూఉంది.  దీనిని 2019 డిసెంబర్లో కనుగొన్నారు. అందుకే దీనికి 2019 నొవెల్ కరోనా అని పేరుపెట్టారు. ఇప్పటివరకు దాదాపుగా ఏడురకాల వైరస్ లు మానవజాతిని అతలాకుతలం చేసాయి. మిగిలిన వైరస్ లు అన్నటికన్నా కరోనా మరీ ప్రమాదంగా మారింది.

కరోనా చైనాలోని ఒక మార్కెట్నుండి గబ్బిలాల ద్వారా వ్యాపించిందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది కానీ సెంట్రల్ మెడికల్ అఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు ఒక రకమైన పామునుంచి ఇది మనుషులకు సంక్రమించినట్లుగా అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా ఈ వైరస్ పుట్టుక చైనాయే అని ఇప్పుడు ప్రపంచం అంతా నమ్ముతూఉంది.  

2019 డిసెంబర్ 31 న 27 మంది పేషెంట్స్ కి క్రొత్తరకం వైరస్ వ్యాపించినట్లుగా చైనా ప్రభుత్వం ప్రకటించింది.  జనవరి 7 న దీనికి COVID N - 19 అని పేరుపెట్టారు.  జనవరి 9 న చైనాలో ఫస్ట్ కరోనా డెత్ సంభవించిందని ఆ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13 న చైనా వెలుపల థాయిలాండ్ లో మొదటి కరోనా కేసు నమోదయ్యింది. ఆ వ్యక్తి చైనాలోని వుహాన్ మార్కెట్ సందర్శించినట్లు చెప్పటంవలన ఈ వైరస్ ఆ మార్కెటనుంచే పుట్టిందని మొదటిసారిగా శాస్త్రజ్ఞులు నిర్దారించారు.  

జనవరి 15 న జపాన్లో మొదటి కేసు నమోదయ్యింది.  అక్కడకూడా చైనానుంచి వచ్చిన వ్యక్తికే కరోనా సోకినట్టు గుర్తించారు.  ఆ తరువాత నేడు దాదాపుగా ప్రపంచమంతా ఈ మహమ్మారి వ్యాపించి లక్షలమంది ప్రాణాలను హరిస్తూఉంది. మొదటగా జనవరి 20 న కరోనా మనుషులనుండి మనుషులకు వ్యాపిస్తుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. కరోనాకి ఇప్పటికైతే మందులేదు.  మాస్కులను ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడంతో  మాత్రమే కొంతవరకు అదుపుచేయగలం.  తస్మాత్ జాగ్రత్త.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle