newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

కరోనాతో బ్యాంకు వేళల్లో మార్పులు

24-03-202024-03-2020 09:07:35 IST
2020-03-24T03:37:35.270Z24-03-2020 2020-03-24T03:37:31.288Z - - 09-04-2020

కరోనాతో బ్యాంకు వేళల్లో మార్పులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారతపై పంజా విసురుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈనెల 31వరకు బ్యాంకు పని వేళల్లో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు బ్యాంకులు పని చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ఏటీఎంలలో పూర్తిగా నగదు అందుబాటులో ఉంచాలని బ్యాంకు అధికారులను ఆదేశించింది.

కొత్త ఖాతాలు తెరవడం, రుణాల మంజూరు వంటి సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సిబ్బంది ఆధారంగా 50 శాతం మందితో పనిచేయాలని నిర్ణయించింది. అన్ని ఏటీఎంలలో పూర్తిగా నగదు అందుబాటులో ఉంచాలని బ్యాంకు అధికారులను ఆదేశించింది.  ఏటీఎం కేంద్రాల వద్దకు గుంపులుగా వెళ్లొద్దని బ్యాంకర్ల సమితి ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది. కరోనాను నియంత్రించేందుకు సామాజిక దూరం పాటించాలని బ్యాంకర్ల సమితి సూచించింది.

అవసరమయితేనే బ్యాంకు శాఖలకు వెళ్ళాలని, ఇంటర్నెట్, డిజిటల్ సేవలను వినియోగించుకోవాలని బ్యాంకులు తెలిపాయి. ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో అన్ని ఏటీఎంలలో నిర్దేశిత సమయంలో నగదును నింపుతాయని తెలిపింది. ఉ. 5 నుండి ఉ. 9 వరకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఈ నెల 31న పరిస్ధితిని మరోసారి సమీక్షించాక తిరిగి వీటిలో కొన్ని మార్పులు చేయనుంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle