newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

కన్నీళ్ళు పెట్టిస్తున్న ఇటలీ పౌరుడి లేఖ

24-03-202024-03-2020 12:55:01 IST
2020-03-24T07:25:01.574Z24-03-2020 2020-03-24T07:24:43.138Z - - 09-04-2020

కన్నీళ్ళు పెట్టిస్తున్న ఇటలీ పౌరుడి లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా మూకుమ్మడిగా దాడిచేస్తుండడంతో ఇటలీ దేశం అల్లాడిపోతోంది. రోజురోజుకీ పరిస్థితి అక్కడ చేజారిపోతోంది. తాజాగా ఓ ఇటలీ పౌరుడు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇటలీ నుండి పౌరుడి ఆవేదనాభరిత లేఖ....

అందమైన దేశం..ప్రశాంతమైన జీవితం....

సుఖసంతోషాలతో ప్రజలు ..మా దేశం ఇటలీ మహా నగరం, మిలాన్ 

నేను మీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. అదేమంటే మా నగరంలో జీవితం ప్రస్తుతం ఏ విధంగా ఉంది... ఎందుకు ఈ విధంగా దుర్బరంగా మారిపోయింది. ప్రపంచంలోనే అందమైనది గా పేరొందిన మానగరం ఎందుకిలా అయింది....⁉ మీరంతా మేము చేసిన పొరపాట్ల నుండి నేర్చుకొని, మాలాగా మీ జీవితాలను, మీ దేశాన్ని చీకట్లోకి నెట్టి వేయరని, నెట్టి వేయకుండా ఉంటారని మీకు ఈ విషయం చెబుతున్నాను.

ఇప్పుడు మేమంతా ఉన్నది క్వారంటైన్ లో...వీధుల్లోకి వెళ్ళలేము... పొరపాటున వెళితే వెంటనే పోలీసులు వచ్చి తీసుకెళ్లి చెరసాలలో బంధిస్తారు. అన్నీ మూతపడ్డాయి... షాపులు, ఆఫీసులు, వీధులు అన్ని మూతపడ్డాయి....మాకు అనిపిస్తుంది ఇదే యుగాంతం ఏమో అని...

మాది ఒక అందమైన అభివృద్ధి చెందిన దేశం. మేము అనుకోలేదు ఇలా... ఈనాడు గాఢాంధకారం లోకి నెట్టి వేయబడుతుంది మా దేశం అని. దీనికంతటికి కారణం ఒకటే....మేమే... ఇటాలియన్స్. మేము చేసినటువంటి తప్పే... మా దేశం అనుభవిస్తున్న ఈ కష్టానికి కారణం. ఒక్క క్షణం... మేము గత వారం, మా ప్రభుత్వ అధికారులు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే, ఈనాడు మా దేశానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు.

వ్యాధి వ్యాపిస్తుందని.... బయటకు వెళ్ళవద్దని... మా ప్రభుత్వం సెలవులు ఇస్తే మేము ఏం చేసామ్....? విహారయాత్రలకు వెళ్లాము... సినిమాకి వెళ్ళాం...చిన్న... పెద్ద పార్టీలు చేసుకున్నాం. బజారు లో కూర్చుని.... గుంపులుగుంపులుగా... ముచ్చట్లు పెట్టుకున్నాం. అందరం కూడా ప్రభుత్వం చేసిన సూచనను చాలా తేలికగా తీసుకున్నాం. ఆనాడు మాకు తెలియదు.... ఆ క్షణం చేసినటువంటి 

ఆ చిన్న తప్పు... ఈనాడు మా దేశాన్ని... మా దేశ ఆర్థిక వ్యవస్థను... చిన్నాభిన్నం చేస్తుందని రోజుకు ఐదారు వందల మంది చనిపోతున్నారు.

ఇది మా దేశంలో మందులు లేక కాదు...వైద్యులు లేక కాదు.కేవలం అంతమంది వ్యాధిగ్రస్తులను ఉంచడానికి సరిపోయేంత స్థలం లేక. ఇదంతా పౌరులుగా చేసిన తప్పు వల్లనే ప్రభుత్వం చెప్పిన మాట వినకపోవడం వలనే.  అవును మేము తప్పు చేశాం... 

ప్రపంచ ప్రజలారా మేల్కొండి.... మా పరిస్థితి మీకు రావద్దని హృదయం బద్దలయ్యే బాధతో మీకు మా విషయం తెలియజేస్తున్నాం....

తక్షణమే మీ ప్రభుత్వం మీ అధికారులు చేసినటువంటి సూచనలు పాటించండి. పండుగలు... జాతరలు... పెళ్లిళ్లు... పేరంటాలు ప్రాణాలు మిగిలితే ఇప్పుడు కాకపోతే....మరెప్పుడైనా చేసుకోవచ్చు....

వినండి అందమైన అభివృద్ధి చెందిన ఒక చిన్న దేశంగా మొదలెట్టిన మా ప్రయాణం..‌ ఈనాడు ఎలా ఉందో మీరంతా చూస్తూనే ఉన్నారు. మీకు మా పరిస్థితి రావొద్దు...

మీరు మారతారని ఆశిస్తూ 

మీ మిత్ర దేశ పౌరుడు....


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle