facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

కట్టలపాములు.. బంగారు బిస్కెట్లు

13-03-201913-03-2019 07:43:04 IST
Updated On 13-03-2019 19:29:36 ISTUpdated On 13-03-20192019-03-13T02:13:04.603Z13-03-2019 2019-03-13T02:12:50.911Z - 2019-03-13T13:59:36.282Z - 13-03-2019

కట్టలపాములు.. బంగారు బిస్కెట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిఘా నీడలో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఖాకీల నిఘాలో కట్టలపాములు, బంగారు బిస్కెట్లు పట్టుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో తనిఖీల పేరిట అక్రమ నగదు, బంగారం రవాణా పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న విస్తృత తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం పట్టుబడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం టోల్‌ప్లాజాలో  మంగళవారం పోలీసు, రెవిన్యూ అధికారులతో కూడిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వాహనాల తనిఖీ చేపట్టింది.

విశాఖపట్టణం నుంచి ఏలూరు వైపు వస్తున్న ఆడి కారును ఆపి తనిఖీ చేశారు. తనిఖీ అధికారులకే మైండ్ బ్లాంక్ అయింది. 300 బంగారు బిస్కెట్లు మొత్తం 30 కేజీలు బంగారు బిస్కెట్లు దొరికాయి. వీటికి సంబంధించి ఏ విధమైన రశీదులు లేకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులకు సీజ్ చేశారు. అలాగే మంగళగిరిలో తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు రూ.82 లక్షల నగదు పట్టుకున్నారు. ఆర్‌ అండ్‌ బి రహదారి బంగ్లా సమీపంలో వాహనాల తనిఖీ సందర్భంగా నగదు వెలుగు చూసింది. నగదు

కు సంబంధించి ఏ విధమైన ఆధారాలు పోలీసులకు చూపించలేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగంగా స్థలం కొనుగోలుకు తీసుకెళుతున్నట్లు చెప్పినప్పటికీ అనధికారికంగా తీసుకెళ్లడం నేరంగా పరిగణించి ఆదాయ పన్ను శాఖ అధికారులకు స్వాధీనం చేశారు. 

మరోవైపు శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలో రెండు వాహనాల నుంచి రూ.8.29 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు నుంచి రూ.6.29లక్షలు, మరో కారు నుంచి రూ.2లక్షలు సీజ్ చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె పెనుమూడి వారధి వద్ద కారులో తరలిస్తున్న రూ.6లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు సిటీ అరండల్‌ పేట అమరావతి రోడ్డులో నగదు తరలిస్తున్న ఒక వాహనం నుంచి రూ.కోటి నగదును అధికారులు పట్టుకున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్ళడం కుదరదు. ఒకవేళ అంతకుమించి నగదు తీసుకెళ్ళాలంటే మాత్రం తగిన ఆధారాలు తప్పనిసరి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle