newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఔటర్‌పై బెంజ్ కారు బీభత్సం ... ఒకరి మృతి.. డ్రైవర్ పరిస్థితి విషమం

29-06-202029-06-2020 11:41:27 IST
Updated On 29-06-2020 11:40:15 ISTUpdated On 29-06-20202020-06-29T06:11:27.262Z29-06-2020 2020-06-29T06:01:36.319Z - 2020-06-29T06:10:15.716Z - 29-06-2020

ఔటర్‌పై బెంజ్ కారు బీభత్సం ... ఒకరి మృతి.. డ్రైవర్ పరిస్థితి విషమం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మద్యం మత్తులో ఏం జరుగుతుందో తెలీని స్థితిలో డ్రైవర్లు కార్లు నడుపుతున్నారు. హైదరాబాద్ శివారులో ఓ బెంజ్‌ కారు బీభత్సం కలిగించింది. వేగంగా వచ్చిన ఆ కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో అందులో ఉన్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. నగరవాసి  శ్రీనివాస్‌రావు శనివారం రాత్రి 11.30 గంటలకు బెంజ్‌ కారు ఏపీ 39 సీఎస్‌ 9999 కారులో పుప్పాలగూడ టోల్‌గేట్‌ సర్వీస్‌ రోడ్డు మీదుగా వేగంగా వచ్చాడు. అదే సమయంలో రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ ప్రాంతానికి చెందిన నాగేశ్వర్‌రావు తన కారులో నార్సింగి వైపు వస్తున్నాడు.

ఇదే సమయంలో అదుపుతప్పిన శ్రీనివాస్‌రావు బెంజ్‌.. నాగేశ్వర్‌రావు కారును బలంగా ఢీకొంది. దీంతో కారు పల్టీలు కొట్టి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో  నాగేశ్వర్‌రావు తీవ్రంగా గాయపడి మరణించాడు. ఐ 20 కారులోని బెలూన్‌లు తెరుచుకున్నప్పటికీ ఆయన బతకలేదు. బెంజ్‌ కారులోని బెలూన్‌లన్నీ తెరుచుకోవడంతో శ్రీనివాస్‌రావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణం అయిన శ్రీనివాస్‌రావు మద్యం మత్తులో ఉన్నట్లు తెలియడంతో పరీక్షలకు పంపారు.

మందడంలో ప్రమాదం.. డ్రైవర్ పరిస్థితి విషమం