newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

ఏపీలో విషాదం.. అమ్మఒడి డబ్బుల కోసం గొడవ

14-01-202014-01-2020 18:28:08 IST
2020-01-14T12:58:08.699Z14-01-2020 2020-01-14T12:58:07.303Z - - 24-02-2020

ఏపీలో విషాదం.. అమ్మఒడి డబ్బుల కోసం గొడవ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పేదలకు మరింత ఉన్నత చదువులు చెప్పించేందుకు, స్కూలుకి పంపేందుకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టింది. లక్షలాది మంది నిరుపేద తల్లులకు ఈ పథకం చేయూతనిస్తోంది. తమ చిన్నారులను బడికి పంపించే ప్రతి నిరుపేద తల్లికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అందించేలా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

దాదాపు 43 లక్షల మంది తల్లులకు మేలు చేకూర్చేలా తొలి బడ్జెట్‌లోనే అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్ల నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. అక్షరాస్యత పెంపు లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పథకాన్ని అమలుచేస్తోంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు.

చిత్తూరు జిల్లాలో అమ్మఒడి ఓ కుటుంబంలో గొడవలకు కారణం అయింది. పుంగనూరు మండలం నేతిగుండ్లపల్లి గ్రామంలో అమ్మ ఒడి డబ్బులు కోసం భార్యా భర్తలు గొడవకు దిగారు. భర్త ప్రవర్తనకు విసిగిపోయిన భార్య ఆదిలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదిలక్ష్మి మృతి చెందింది. దీంతో పిల్లలకు తల్లి దూరమయింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle