newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మహిళల రక్షణకు కఠినచర్యలు

10-07-202010-07-2020 19:42:49 IST
2020-07-10T14:12:49.364Z10-07-2020 2020-07-10T14:10:53.259Z - - 08-08-2020

ఏపీలో మహిళల రక్షణకు కఠినచర్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టం తెచ్చిన ఘనత ఏపీ రాష్ట్రానికి, సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై డిజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసిన వాసిరెడ్డి పద్మ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటూరులో నగ్న వీడియోలు కేసు మరవకముందే మరో కేసు నమోదు అయ్యిందని, ఈ కేసులో పోలీసుల పాత్రపై దృష్టి పెట్టాలని డిజీపీని కోరాననన్నారు. 

దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సానుకూలంగా స్పందించారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. దిశ యాప్ ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులకు తెలపాలన్నారు. మహిళా ఉద్యోగులపై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

సైబర్ నేరాలకు పాల్పడే వారిపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. మహిళా కమిషన్‌ దృష్టికి వచ్చిన కేసుల వివరాలను డీజీపీకి తెలియజేశారు.ఇటీవల టూరిజం ఉద్యోగి మహిళా ఉద్యోగిపై దాడిచేసిన ఘటనపై పోలీసులు వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. విద్యార్ధినులపై దాడులు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle