newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

ఎంత అందంగా ఉందో.. అంతే ప్రమాదకారి..!

19-09-202019-09-2020 09:12:04 IST
2020-09-19T03:42:04.823Z19-09-2020 2020-09-19T03:42:00.836Z - - 21-10-2020

ఎంత అందంగా ఉందో.. అంతే ప్రమాదకారి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ భూమి మీద ఎన్నో రకాల పాములు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎంతో అందంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అబ్బా.. పాము కూడా ఎంత అందంగా ఉందో కదా అని మనకు అనిపించకమానదు. తాజాగా అలాంటి ఓ పాము గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చించుకుంటూ ఉన్నారు. ఇంతకూ అందులో ఉన్న పాము ఏమిటో తెలుసా..? 'బ్లూ పిట్ వైపర్'

ఈ పాముకు సంబంధించిన వీడియోను చూసి చాలా మంది ఎంత బాగుందో కదూ అంటూ తెగ పొగిడేస్తూ ఉన్నారు. ఆ నీలం రంగు పాము ఓ ఎర్రటి రోజా మీద కూర్చుని ఉంది. చూడడానికి ఎంతో అందంగా అనిపిస్తూ ఉంటుంది.

అందంగా ఉన్నంత మాత్రాన ఆ పాము విషపూరితమైనది కాదు అని అనుకోకండి. ఎందుకంటే ఆ పాము ఒక్క సారి కాటేస్తే శరీరం లోపల, బయట తీవ్రంగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉందట..! ఆ పాము విషం చాలా ప్రమాదకరమని చెబుతూ ఉన్నారు.

మాస్కో జూ ప్రకారం ఈ పాములు ఇండోనేషియా, తూర్పు టిమోర్ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. వీటిని పిట్ వైపర్ అని అంటూ ఉంటారు. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. నీలం రంగులో కనిపించడం చాలా అరుదు అని చెబుతున్నారు. నీలం రంగు పాముల జంట కలిస్తే అవి ఆకుపచ్చ రంగు పాములకు జీవం ఇవ్వగలవట..!

'Life on Earth' అనే ట్విట్టర్ ఖాతాలో ఈ పాముకు సంబంధించిన వీడియోను పోస్టు చేసారు.

"The incredibly beautiful Blue Pit Viper," అంటూ ఈ పోస్టు చేసిన ఈ వీడియో పలువురిని ఆకర్షించింది. పాము చాలా అందంగా ఉంది.. కానీ ఆ పాము ఎంత విషపూరితమైనదో తెలుసుకుని నెటిజన్లు షాక్ తింటున్నారు. Reddit లో కూడా ఈ వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ పాము ఎంత అందంగా ఉన్నప్పటికీ దానికి దూరంగా ఉండడమే మంచిదని పలువురు హెచ్చరిస్తూ ఉన్నారు.  

ఇంటర్నెట్ లో బ్లూ పిట్ వైపర్లు విషపూరితమైనవని, చాలా కోపంతో ఉంటాయని ఉంది. ఈ పాముల విషం వలన చనిపోవడం చాలా అరుదుగా జరుగుతున్నప్పటికీ.. హ్యామరేజ్ కు కారణం అవ్వొచ్చు.. విపరీతమైన నొప్పి, వాపు, బయట,లోపల రక్త స్రావం జరిగే ప్రమాదం ఉందని రాసి ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle