newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

ఉప్పుతో కరోనా ముప్పు తగ్గుతుందా?

28-06-202028-06-2020 09:25:27 IST
2020-06-28T03:55:27.687Z28-06-2020 2020-06-28T03:55:14.596Z - - 11-07-2020

ఉప్పుతో కరోనా ముప్పు తగ్గుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంతా ఇబ్బంది పడుతోంది. కరోనా వణికిస్తున్న వేళ దాని బారిన పడకుండా రక్షించుకునేందుకు నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు. కరోనాను అంతమొందించేందుకు డ్రగ్ కోసం పలు పరిశోధనలు జరుగుతున్నాయి. అది అందుబాటులోకి వచ్చే వరకూ మరి కొన్ని జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ ను ప్రారంభ దశలోనే నిర్మూలించేందుకు తాజాగా కొత్త సూచన చేస్తున్నారు. 

మనం నిత్యం ఉపయోగించే ‘ఉప్పు’ ద్వారా దీనిని మొదట్లోనే తగ్గించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ లక్షణాలు కనబడిన ప్రారంభ దశలోనే సముద్రపు ఉప్పుతో వాటిని అరికట్టవచ్చని ‘ఎడిన్ బర్గ్ బిలీవ్’ కు చెందిన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జలుబుతో బాధపడేవారిలో కణాల యాంటీ వైరల్ రక్షణను పెంచే సామర్ధ్యం సముద్రపు ఉప్పు కు ఉందని వారు తేల్చారు.

కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యేచోట మిగిలిన వారు కరోనా బారిన పడకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో భాగంగా ఉప్పునీటి ద్రావణంతో ముక్కును శుభ్రపరచుకోవాలని సూచిస్తున్నారు. ముక్కును శుభ్రపరిచిన వారిలో జలుబు, దగ్గు తగ్గిపోవడాన్ని గుర్తించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2019లో జరిపిన ఓ ప్రయత్నం ఆధారంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం కనుగొన్నట్లు తెలిపారు. దీని ఆదారంగా కరోనా వైరస్ పై కూడా ఉప్పు పనిచేసే అవకాశాలు ఉన్నాయా అని పరిశోధించారు. తరచూ వేడినీటిని తాగడం, ఉప్పునీటితో నోటిని శుభ్రపరుచుకోవడం, నిమ్మకాయ రసం తాగడం ఆరోగ్యానికి మంచిది. 

'కోవిడ్ -19 అనుమానిత లక్షణాలు లేదా కరోనా అని తేలిన వారిలో ఉప్పునీటి రెమిడీతో పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని స్కాట్లాండ్‌లోని ‘అషర్ ఇనిస్టిట్యూట్ ’ డైరెక్టర్ ప్రొఫెసర్ అజీజ్ షేక్ తెలిపారు. ఈ ఉప్పు నీటి ప్రక్రియ వైరస్ పై మంచి ఫలితాలను ఇస్తుందన్న ఆశాభావాన్నిఆయన వ్యక్తం చేశారు. ఉప్పు, నీటిని ఉపయోగించే విధానంపై కొంత అవగాహన ఉంటే సరిపోతుందన్నారు. ఈ విధానం అనుసరించడం కూడా ఎంతో సులభమైందంటున్నారు.

కరోనా వైరస్ బారినుంచి త్వరగా బయటపడడానికి మంచి ఆహారం ఒక్కటే మార్గం అని, మంచి ఫుడ్​తోనే కరోనా తొందరగా నయమవుతుందంటున్నారు డైటీషియన్లు. హాస్పిటల్​లో అడ్మిట్​ అయిన కరోనా పేషెంట్లకు సరైన డైట్​ మెనూను ప్రత్యేకంగా ప్రిపేర్​ చేయాల్సి వుంటుంది. పాజిటివ్​ వచ్చిన వాళ్లు 17 రోజుల తర్వాత కూడా ఆ డైట్​నే రెండు, మూడు నెలల పాటు తీసుకుంటే చాలా వరకు మంచిది.

ఇమ్యూనిటీ పెరిగేలా ఇమ్యునో న్యూట్రియంట్స్​ బాగా తీసుకోవాలి. విటమిన్​ సి, జింక్​ ఉండేలా చూసుకోవాలి.విటమిన్​ సీ ని రోజూ 500 ఎంజీ నుంచి 1,000 ఎంజీ వరకు తీసుకోవాలి. విటమిన్​ డీ కూడా ఎక్కువగా వాడాలి. ప్రోటీన్​ ఫుడ్​నూ తినాలి. పాలు, మాంసం, పుట్టగొడుగులు, గుడ్డులోని తెల్లసొన, పండ్లు, డ్రై ఫ్రూట్స్​ లాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలి. మల్టీ విటమిన్ టాబ్లెట్లకు బాగా గిరాకీ పెరుగుతోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle