newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

ఉగాది పచ్చడిలోని పరమార్థం

25-03-202025-03-2020 13:10:07 IST
Updated On 25-03-2020 15:31:07 ISTUpdated On 25-03-20202020-03-25T07:40:07.942Z25-03-2020 2020-03-25T07:39:52.697Z - 2020-03-25T10:01:07.128Z - 25-03-2020

ఉగాది పచ్చడిలోని పరమార్థం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉగాది.. తెలుగు సంవత్సరాది. ఎన్నో కొత్త ఆశలతో జనం నూతనవత్సరాదిని ఆహ్వానిస్తారు. ఉగాది అంటేనే ఉషోదయం. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. జీవితానికి అదే పరమార్థం. ఉగాది పర్వదినంనాడు కోయిలలు తమ రాగాలతో ఈ నూతన సంవత్సరానికి సుస్వాగతం పలుకుతాయి. మల్లెలు, మామిడిపిందెలు, సువాసనతో కూడిన వేపపూత.. అంతకంటే ఉత్సాహంగా ఆహ్వానిస్తాయి. మావిచిగురు, వేపపూత, మల్లెల గుబాళింపులు, కోయిల కుహూ కుహూ రాగాలు, పంచాంగ శ్రవణం వంటి ప్రతీదీ ఉగాదికి సంకేతాలనిస్తాయి. శ్రీశార్వరి సంవత్సర వైభోగమంతా తెలుగువారి వాకిళ్ళలో తీర్చిదిద్దిన రంగవల్లికల్లో దర్శనమిస్తుంది. మావిడాకుల తోరణాల్లో ఒదిగి చూస్తుంది. పంచాంగ శ్రవణంలో ప్రతిధ్వనిస్తుంది. ఉగాది పచ్చడి తినడం అంటేనే అదో అనుభూతి. మామిడి పిందెలు, వేపపూత, కొత్త బెల్లం, అరటిపండు అన్నీకలగలిపి పచ్చడి చేసుకుని నోట్లో వేసుకుంటే ఆ అనుభూతే వేరు.

ఉగాది అనే పదం ‘యుగాది’ నుండి పుట్టుకొచ్చింది. ఉగాదిలో.. "ఉగ'' అంటే నక్షత్ర గమనం.. ''ఆది'' అంటే మొదలు. మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అని అర్థం చెప్పుకోవచ్చు. ''యుగము'' అంటే జంట అని అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనముల కలయికే యుగాది. అలా యుగానికి ఆది 'యుగాది' లేదా 'ఉగాది' అయింది. మనం ఇప్పుడున్నది కలియుగం కాలంలో... అసలు కలియుగం అంటే ఏమిటో తెలుసా..? శ్రీకృష్ణుడు ఈ జగత్తును విడిచి వెళ్ళినప్పుడే కలియుగం ప్రారంభమైంది అంటూ వేదవ్యాసుడు చెబుతాడు. 

ఉగాది రోజున తెలుగువారు చేసే సందడి అంతాఇంతా కాదు. ఆడపిల్లలు రంగురంగుల పరికిణీలు, చీరలు ధరించి, కాళ్ళకు పసుపు, తలలో మల్లెలు పెట్టుకుని పదహారణాల ఆడపడుచుల్లా ముస్తాబవుతారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఉగాది పచ్చడి తయారుచేస్తారు. వేపపూత, మామిడి ముక్కలు, బెల్లం, ఉప్పు, మిరియాలు, చింతపండులను ఉపయోగించి తయారుచేసే ఉగాది పచ్చడిలో ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వగరు వంటి షడ్రుచులు మిళితమై ఉంటాయి.

ఈ షడ్రుచులను కోపం, ద్వేషం, సంతోషం, దుఃఖం లాంటి భావోద్వేగాలకు సంకేతాలుగా భావిస్తారు. జీవితంలో ఎప్పుడూ సుఖసంతోషాలే ఉండవని, మాధుర్యం మాత్రమే తొణికిసలాడదని, కష్టం, సుఖం కలగలిసి ఉంటాయని చెప్తుంది ఉగాది. దేనికీ పొంగిపోక, కుంగిపోక ప్రతిదాన్నీ సమదృష్టితో చూడాలని, అన్నిటికీ అతీతంగా ఉండాలనే సందేశాన్ని ప్రబోధిస్తుంది ఉగాది. ఉగాది పచ్చడిని దేవునికి నివేదించి, ఆనక ప్రసాదంగా తీసుకుంటారు. గారెలు, పాయసం, పులిహోర లాంటి ఇతర పిండివంటలనూ చేసుకుని దేవునికి నైవేద్యంగా సమర్పించినప్పటికీ ఉగాది పచ్చడిదే అగ్రస్థానం. 

ఉగాది అంటే కొత్త సంవత్సరం కనుక ఆరోజు మొదలు ఏడాది అంతా ఎలా ఉంటుందో అని తెలియజేసే పంచాంగ శ్రవణం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా.. అతివృష్టి, అనావృష్టి లాంటివి ఉన్నాయా.. తుఫానులు, భూకంపాలు లాంటి ప్రకృతి ప్రళయాలు ఏమైనా ఉన్నాయా.. దేశం సుభిక్షంగా ఉంటుందా లేదా తదితర అంశాలన్నీ పంచాంగంలో కనిపిస్తాయి. ఆయా రాశులకు గ్రహఫలాలను జ్యోతిష్య శాస్త్ర పండితులు క్షుణ్ణంగా వివరిస్తారు. ఉగాది పండితులకే కాదు, కవీశ్వరులకూ ఇష్టమైన పండుగ. సాంస్కృతిక సంస్థలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కవి సమ్మేళనాలు నిర్వహిస్తాయి. మంచి కవిత్వం చెప్పి అలరించినవారిని సత్కరించి సన్మానిస్తాయి. 

మనది చంద్రమాన కాలెండర్ కనుక ఉగాది ప్రతి సంవత్సరం ఒకే రోజున రాదు. శక కాలెండర్ చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఇంగ్లీష్ నెలలను అనుసరించి చూస్తే మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆంధ్రులకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కొంకణి వాళ్ళక్కూడా ఉగాది పర్వదినమే. అయితే తాజాగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దేవాలయాల్లో ఎలాంటి ఆర్భాటం లేదు. కవి సమ్మేళనాల ఊసేలేదు. స్వీయ గృహనిర్బంధంలో వున్న మనమంతా ఈ ఉగాదిని నిరాడంబరంగా జరుపుకుని.. కరోనా మహమ్మారినుంచి బయటపడదాం. అలా సురక్షితంగా బయటపడిన రోజే మనకు నిజమయిన ఉషస్సు, నిండైన ఉగాది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle