newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో తింటే వహ్వా అనాల్సిందే!

11-07-201911-07-2019 15:36:53 IST
Updated On 12-07-2019 12:29:36 ISTUpdated On 12-07-20192019-07-11T10:06:53.078Z11-07-2019 2019-07-11T10:06:50.579Z - 2019-07-12T06:59:36.114Z - 12-07-2019

ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో తింటే వహ్వా అనాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈరోజుల్లో ఏదైనా ఫుడ్ ఐటెం కావాలంటే ఏ హోటల్‌కో వెళ్ళి తినేస్తాం. బయటకు వెళ్ళకుండానే ఏయాప్‌లోనో ఫుడ్ ఆర్డర్ చేసి ఇంటి ముంగిటకే తెప్పించుకుంటున్నాం. అంతే తప్ప, కమ్మగా, శుచిగా వంట చేయడం ఇళ్ళల్లో చాలా తగ్గిపోయింది. అయితే కొన్ని విద్యాకోర్సులలో మాత్రం ఖచ్చితంగా వివిధ రకాల ఫుడ్ వెరైటీలు తయారుచేయడం కంపల్సరీ. సికింద్రాబాద్ లోని ఆర్‌జీఆర్ సిద్ధాంతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్ధినులు వందలాది వెరైటీలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. 

బీఇడీ కరిక్యులమ్‌లో భాగంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ రూపొందించామని కాలేజ్ ప్రిన్సిపల్ రత్నస్వరూప ‘న్యూస్ స్టింగ్’కి చెప్పారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా విద్యార్ధినులే తయారుచేసిన ఫుడ్ ఐటెమ్స్ తో ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటుచేశామన్నారు. సామాజిక బాధ్యతను పెంచేవిధంగా ఏటా ఇలాంటి కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు.

జంటనగరాల్లోనే ఆర్ జీఆర్ సిద్ధాంతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. విద్యార్ధులకు థియరీతో పాటు, ప్రాక్టికల్స్ కూడా సమగ్రంగా అందించేందుకు ఫుడ్ ఫెస్టివల్ దోహదపడుతుందని విద్యార్ధినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఇడీ మూడో సంవత్సరం విద్యార్ధినులు తమకు ఇష్టమయిన తెలంగాణ, దేశీయ వంటకాలను ఈ ఫుడ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో తెలంగాణ వంటకాలు ఎక్కువగా కొలువుతీరాయి.

Image may contain: 2 people

తెలంగాణ సంప్రదాయాలతో పాటు పంజాబీ లస్సీలు, డ్రై ఫ్రూట్ లస్సీలు, మసాలా వడ, పానీపురి, బిర్యానీ, బేల్ పురి, లస్సీ పంజాబీ వంటకాలు నోరూరిస్తున్నాయి. ఈ ఫుడ్ ఫెస్టివల్ కోసం తెలంగాణ డిషెస్ ఎక్కువగా తయారుచేశామని విద్యార్దిని తెలిపారు. చాలా రోజుల తర్వాత సంప్రదాయ రుచులు ఒకేచోట కనిపించడం బాగుందని విద్యార్ధినులు చెబుతున్నారు.

Image may contain: food

ఈ ఫుడ్ ఫెస్టివల్ లో వివిధ రకాల బిర్యానీలు, ఫిష్ పింగర్, పురానా పోలీ, బేక్డ్ ఛీజ్ కేక్, చికెన్ బిర్యానీ, వెజ్ మంచూరియా, మసాలా వడ, బిషిబెలి బాత్, వెగ్ ఆలూ బోండా, పావ్ బజ్జీ, పులిహోర, డబుల్ కా మీటా, మటన్ కోఫ్తా, భేల్ పురి, గులాబ్ జామూన్, ఫ్రూట్ కస్టర్డ్, బొబ్బట్లు, గారెలు, ఆనియన్ పకోడీ, సేవియాన్ కీ మీటా, చైనీస్ నూడుల్స్.. ఇలా ఎన్నో రకాల సంప్రదాయ, ఆధునిక వంటకాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Image may contain: 5 people, people sitting

ఈ ఫుడ్ ఫెస్టివల్ లో తయారుచేసిన వంటకాలను ప్రదర్శన అనంతరం ఎంవీ ఫౌండేషన్ లోని అనాథలకు ఈ ఫుడ్ అందచేస్తాం అన్నారు విద్యార్దినులు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తంచేస్తున్నారు బీఇడీ విద్యార్ధినులు.

Image may contain: food

టీచింగ్ ప్రొఫెషన్ సమాజంలో ఎంతో ఉన్నతమయినది. కేవలం థియరీతో సరిపెట్టకుండా ప్రాక్టికల్స్ ద్వారా బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అభినందనీయం. మన సంప్రదాయాలను మరిచిపోకుండా దేశంలోన వివిధ ప్రాంతాల విద్యార్ధినులతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్సాటుచేసిన కాలేజీ యాజమాన్యం కృషి అభినందనీయం. మొత్తం మీద ఈ బీఐడీ విద్యార్ధినుల ఫుడ్ ఫెస్టివల్ .. తిని తరించాల్సిందే!

ఫోటోలు:మామిడి వెంకటేశ్వర్లు 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle